Asia Cup 2023: ఆసియా కప్ ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. తొలి 2 మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం..
Asia Cup 2023: ఐపీఎల్ సమయం నుంచే గాయం కారణంగా ఆటకు దూరమైన రాహుల్ ఇటీవలే కోలుకొని టీమిండియాలోకి తిరిగొచ్చాడు. బెంగళూరులో జరిగిన యోయో టెస్ట్ కూడా పాస్ అయ్యాడు. దీంతో రాహుల్ ఆసియా కప్ ద్వారా ఆటలోకి పునారాగమనం చేస్తాడని, సత్తా చాటతాడని అందరూ అనుకున్నారు. అయితే ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్, నేపాల్‌తో జరిగే తొలి రెండు మ్యాచ్‌లకు రాహుల్ అందుబాటులో ఉండడని..
Asia Cup 2023: ఆసియా కప్ ప్రారంభమయ్యేందుకు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉండగా, ఈ సమయంలో టీమిండికు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఐపీఎల్ సమయం నుంచే గాయం కారణంగా ఆటకు దూరమైన కేఎల్ రాహుల్ ఇటీవలే కోలుకొని టీమిండియాలోకి తిరిగొచ్చాడు. బెంగళూరులో జరిగిన యోయో టెస్ట్ కూడా పాస్ అయ్యాడు. దీంతో రాహుల్ ఆసియా కప్ ద్వారా ఆటలోకి పునారాగమనం చేస్తాడని, సత్తా చాటతాడని అందరూ అనుకున్నారు. అయితే ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్, నేపాల్‌తో జరిగే తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండడని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు.
UPDATE
KL Rahul is progressing really well but will not be available for India’s first two matches – against Pakistan and Nepal – of the #AsiaCup2023: Head Coach Rahul Dravid#TeamIndia
— BCCI (@BCCI) August 29, 2023
ఈ మేరకు రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ ‘కేఎల్ రాహుల్ త్వరగా కోలుకుంటున్నాడు. కానీ ఆసియా కప్‌లో భారత్ ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండడు. ఎన్‌సీఏ అతన్ని పర్యవేక్షిస్తుంది’ అని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా ఆసియా కప్‌లో భారత్ తన తొలి మ్యాచ్ సెప్టెంబర్ 2న పాకిస్తాన్‌తో.. సెప్టెంబర్ 4న నేపాల్‌తో రెండో మ్యాచ్ ఆడనుంది. కాగా, ఐపీఎల్ 2023 ఆడుతున్న సమయంలో కేఎల్ రాహుల్ తొడ కండరాల గాయంతో టోర్నీ మధ్యలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
రాహుల్ ఔట్..
KL Rahul is progressing really well but will not be available for India’s first two matches – against Pakistan and Nepal – of the #AsiaCup2023: BCCI cites Head Coach Rahul Dravid
(File photo) pic.twitter.com/pu0MTzuVLr
— ANI (@ANI) August 29, 2023
పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ , శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్/ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.
Here’s the Rohit Sharma-led team for the upcoming #AsiaCup2023 🙌#TeamIndia pic.twitter.com/TdSyyChB0b
— BCCI (@BCCI) August 21, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..