World Cup 2023: గెట్ రెడీ.. మరికొన్ని గంటల్లో టీమిండియా మ్యాచ్‌ల టికెట్ల రిలీజ్.. ఎలా బుక్ చేసుకోవాలంటే?
కెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రతిష్ఠాత్మక వరల్డ్ కప్ అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. అంతకుముందు సెప్టెంబర్ 29 నుంచి వార్మప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మెగా క్రికెట్ టోర్నీలో భాగంగా దేశ వ్యాప్తంగా 12 ప్రధాన వేదికల్లో 58 (వార్మప్‌తో కలిపి) మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించి టికెట్ ప్లాట్‌ఫారమ్‌గా బుక్ మై షోని ఎంపిక చేసింది బీసీసీఐ. ఆగస్టు 24 నుంచే టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి.
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత్ వేదికగా త్వరలో జరగనున్న 2023 వరల్డ్ కప్‌లో టీమిండియా మ్యాచ్‌ల టికెట్లు ఇవాళ (ఆగస్టు 29) రిలీజ్ కానున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి బుక్ మై షోలో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే మాస్టర్ కార్డ్ వినియోగదారులు మాత్రమే ఈ టికెట్లను పొందవచ్చని బీసీసీఐ తెలిపింది. ఒక్కరు గరిష్ఠంగా రెండు టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. ఇతరులు బుధవారం (ఆగస్టు 30) నుంచి టికెట్లను బుక్ చేసుకోవచ్చు. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రతిష్ఠాత్మక వరల్డ్ కప్ అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. అంతకుముందు సెప్టెంబర్ 29 నుంచి వార్మప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మెగా క్రికెట్ టోర్నీలో భాగంగా దేశ వ్యాప్తంగా 12 ప్రధాన వేదికల్లో 58 (వార్మప్‌తో కలిపి) మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించి టికెట్ ప్లాట్‌ఫారమ్‌గా బుక్ మై షోని ఎంపిక చేసింది బీసీసీఐ. ఆగస్టు 24 నుంచే టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. అయితే అయితే ప్రస్తుతం వార్మప్ గేమ్‌లు మినహా అన్ని నాన్ ఇండియన్ టోర్నమెంట్ మ్యాచ్‌ల టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
ఇక మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి టీమిండియా మ్యాచ్‌ల టికెట్ల విక్రయాలు కూడా ప్రారంభంకానున్నాయి. మాస్టర్ కార్డ్ ప్రీ సేల్‌లో భాగంగా ఒక్కరు గరిష్ఠంగా రెండు టికెట్లు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. కాగా టీమిండియా చివరిగా 2013లో ఐసీసీ కప్‌ను గెల్చుకుంది. అప్పటి నుంచి కీలక టోర్నీల్లో చతికిలపడుతూనే ఉంది. దీంతో ఈసారైనా ఐసీసీ టైటిల్‌ను నెగ్గాలన్న పట్టుదలతో ఉంది భారత జట్టు. కాగా ప్రపంచకప్ కంటే ముందే మరో మెగా టోర్నీ క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. బుధవారం (ఆగస్టు 30) నుంచి ఆసియాకప్ టోర్నీ ప్రారంభమవుతోంది. ఆరంభ మ్యాచ్‌లో పాకిస్తాన్ వర్సెస్ నేపాల్ తలపడుతుండగా, సెప్టెంబర్ 2 భారత్, పాకిస్తాన్‌ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
ప్రపంచాన్ని చుట్టేస్తోన్న వరల్డ్ కప్ ట్రోఫీ
The stunning wonders of 🇮🇹
A grand time for the ICC Men’s Cricket World Cup 2023 Trophy Tour in Italy 🤩#CWC23 pic.twitter.com/wNeCF3K3Al
— ICC Cricket World Cup (@cricketworldcup) August 25, 2023
ప్రపంచకప్ మ్యాచ్ టికెట్ల విక్రయాలపై ఐసీసీ అప్డేట్
Mastercard cardholders are on the top of the world, and first in queue for the ICC Cricket World Cup 2023 tickets!
Introducing an exclusive 24-hour pre-sale window for @Mastercard cardholders!
Use your Mastercard to book your tickets a day before others and experience the… pic.twitter.com/Ijp73Cnpqc
— ICC Cricket World Cup (@cricketworldcup) August 25, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..