AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Loan: వినియోగదారులకు షాకిచ్చిన ఈ రెండు బ్యాంకులు.. రుణాలు మరింత ఖరీదు

మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు అనేది బ్యాంకులు తమ కార్ లోన్, హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ మొదలైన వాటి వడ్డీ రేటును నిర్ణయించే స్థిర రుణ రేటు. బ్యాంకులు కస్టమర్లకు రుణాలు అందించలేని కనిష్ట రేటు ఇది. ఎంసీఎల్‌ఆర్‌ రేట్లలో బ్యాంక్ ఏదైనా మార్పు చేస్తే, అది కస్టమర్ల రుణ వడ్డీ రేటు, ఈఎంఐపై కూడా ప్రభావం చూపుతుంది. అధిక ఎంసీఎల్‌ఆర్‌ కారణంగా వినియోగదారులపై ఈఎంఐ భారం పెరుగుతుంది...

Bank Loan: వినియోగదారులకు షాకిచ్చిన ఈ రెండు బ్యాంకులు.. రుణాలు మరింత ఖరీదు
Bank Loan
Subhash Goud
|

Updated on: Sep 02, 2023 | 2:40 PM

Share

మరో రెండు బ్యాంకులు ఖాతాదారులకు పెద్ద షాకిచ్చాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో రుణ వడ్డీ రేట్లను పెంచారు. రెండు ప్రధాన బ్యాంకులు ఐసిఐసిఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు (MCLR) పెంచాయి. రెండు బ్యాంకులు తమ ఎంసీఎల్‌ఆర్‌ని 5 బేసిస్ పాయింట్లు పెంచాయి. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం.. కొత్త రేట్లు సెప్టెంబర్ 1, 2023 నుండి అంటే శుక్రవారం నుండి అమలులోకి వచ్చాయి.

ఈ పెంపు తర్వాత, గతంలో లేదా భవిష్యత్తులో కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్, హోమ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేసిన బ్యాంక్ కస్టమర్లపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. రుణ వడ్డీ రేట్లపై ఎంసీఎల్‌ఆర్‌ ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని తెలుసుకోండి.

ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త రేట్ల గురించి తెలుసుకోండి:

ఇవి కూడా చదవండి

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తన ఎంసీఎల్‌ఆర్‌ను 5 బేసిస్ పాయింట్లు పెంచి కోట్లాది మంది ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. ఈ పెరుగుదల తర్వాత బ్యాంక్ ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్‌ 8.40 శాతం నుంచి 8.45 శాతానికి పెరిగింది. ఒక నెల ఎంసీఎల్‌ఆర్‌ 8.45 శాతం, మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 8.50 శాతానికి, 6 నెలల ఎంసీఎల్‌ఆర్‌ 8.85 శాతానికి, ఒక సంవత్సరం ఎంసీఎల్‌ఆర్‌ 8.90 శాతం నుంచి 8.95 శాతానికి పెరిగింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్త రేట్ల గురించి తెలుసుకోండి:

రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెరుగుదల తర్వాత బ్యాంక్ ఓవర్‌నైట్ MCLR 8.10 శాతం నుంచి 8.15 శాతానికి పెరిగింది. ఒక నెల ఎంసీఎల్‌ఆర్‌ 8.20 శాతం నుంచి 8.25 శాతానికి, మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 8.30 శాతం నుంచి 8.35 శాతానికి పెరిగింది.

MCLR అంటే ఏమిటి?

మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు అనేది బ్యాంకులు తమ కార్ లోన్, హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ మొదలైన వాటి వడ్డీ రేటును నిర్ణయించే స్థిర రుణ రేటు. బ్యాంకులు కస్టమర్లకు రుణాలు అందించలేని కనిష్ట రేటు ఇది. ఎంసీఎల్‌ఆర్‌ రేట్లలో బ్యాంక్ ఏదైనా మార్పు చేస్తే, అది కస్టమర్ల రుణ వడ్డీ రేటు, ఈఎంఐపై కూడా ప్రభావం చూపుతుంది. అధిక ఎంసీఎల్‌ఆర్‌ కారణంగా వినియోగదారులపై ఈఎంఐ భారం పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో బ్యాంకులకు వివిధ రకాల రుణాలపై వడ్డీను పెంచేస్తున్నాయి.దీంతో ఈఎంఐల భారం పెరిగిపోతోంది.కానీ తప్పనిసరి రుణం కావాలనుకునే వారికి ఎలాంటి రేట్లు పెరిగినా తీసుకుంటూనే ఉన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో