7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో శుభవార్త రానుందా..?

జనవరి 2023 నుంచి జూన్ 2023 వరకు ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా అందిన సమాచారం ప్రకారం.. తాజాగా కూడా ఎంప్లాయీస్‌కు డీఏ నాలుగు శాతం పెంచనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కరువు భత్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఆమోదం పొందే అవకాశం ఉంది..

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో శుభవార్త రానుందా..?
7th Pay
Follow us
Subhash Goud

|

Updated on: Sep 02, 2023 | 3:18 PM

ఉద్యోగులకు కేంద్ర సర్కార్‌ తీపి కబురు అందించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం త్వరలో ఉద్యోగుల జీతాలు పెంచబోతోంది. మీడియా నివేదికల ప్రకారం.. ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ)ని పెంచుతుందని ప్రకటించవచ్చు. ఈ నెల ప్రారంభంలో కొత్త గణాంకాలు వచ్చాయి. ఆ తర్వాత ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్‌ను 4 శాతం పెంచుతుందని వార్తలు వస్తున్నాయి. జూలై 2023కి సంబంధించిన AICPI ఇండెక్స్ డేటా విడుదలైంది.

4 శాతం పెరగనుంది

కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ 4 శాతం పెరగనుంది. జనవరి 2023 నుంచి ఉద్యోగులు 42 శాతం చొప్పున డీఏ పొందుతున్నారు. అదే సమయంలో ఇందులో 4 శాతం పెరిగిన తర్వాత ఉద్యోగులకు అందే డీఏ 46 శాతంగా ఉంటుంది. ఏఐసీపీఐ ఇండెక్స్ నుంచి అందిన సమాచారం.. ఈ నెలలో నిర్వహించే కేబినెట్‌ భేటీలో ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. AICPI ఇండెక్స్ ప్రకారం, జూన్ 2023 నాటికి మొత్తం డియర్‌నెస్ అలవెన్స్ 46.24 శాతానికి చేరుకుంది. కానీ, ప్రభుత్వం దశాంశాలను లెక్కించదు. అందుకే 46 శాతమే ఫిక్స్ అవుతుంది.

అధికారిక ప్రకటన వెలువడలేదు..

జనవరి 2023 నుంచి జూన్ 2023 వరకు ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా అందిన సమాచారం ప్రకారం.. తాజాగా కూడా ఎంప్లాయీస్‌కు డీఏ నాలుగు శాతం పెంచనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కరువు భత్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఆమోదం పొందే అవకాశం ఉంది.

7వ పే కమిషన్ ప్రకారం.. మీ బేసిక్ జీతం రూ. 18,000 అయితే, మీ నెలవారీ, వార్షిక వేతనంలో ఎంత పెరుగుతుంది.

– ప్రాథమిక జీతం – నెలకు రూ. 18,000 – కొత్త డియర్‌నెస్ అలవెన్స్ – నెలకు రూ. 8280 (46 శాతం) – ప్రస్తుత డీఏ – నెలకు రూ. 7560 (42 శాతం) – ఎంత పెరిగింది – 8280-7560 – 720 రూపాయలు. – అన్యూల్‌ సాలరీ పెంపు – 720X12 – రూ. 8640

7వ వేతన సంఘం వివరాల ప్రకారం చూస్తే.. ఉద్యోగి బేసిక్ జీతం రూ. 56,900 అయితే, మీ నెలవారీ, వార్షిక వేతనంలో ఎంత పెరుగుతుంది.?

– ప్రాథమిక వేతనం – నెలకు రూ. 56,900 – కొత్త డియర్‌నెస్ అలవెన్స్ – నెలకు రూ. 26,174 (46 శాతం) – ప్రస్తుత డీఏ – నెలకు రూ. 23,898 (42 శాతం) – ఎంత పెరిగింది – రూ.26,174-23,898 – నెలకు రూ. 2276 – ఏడాది సాలరీ పెంపు – రూ. 2276X12 – 27వేల 312 రూపాయలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!