AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investment Planning: తక్కువ మొత్తం పొదుపుతో అధిక ఆదాయం.. భారతదేశంలో టాప్‌ పెట్టుబడి పథకాలు ఇవే..!

ముఖ్యంగా పెట్టుబడి ప్రణాళిక, అలాగే సరైన పొదుపు సాధనాలను ఎంచుకోవడం అవసరం. ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్‌లో అత్యంత ముఖ్యమైన అంశాల్లో ఆదాయ సమూహం కూడా ఒకటి. ఇది మనం పెట్టుబడి పెట్టగల డబ్బును నిర్ణయిస్తుంది. కాబట్టి ఆదాయం ఆధారంగా భారతదేశంలోని కొన్ని ఉత్తమ పెట్టుబడి ఎంపికల గురించి తెలుసుకోవడం చాలా అవసరం.

Investment Planning: తక్కువ మొత్తం పొదుపుతో అధిక ఆదాయం.. భారతదేశంలో టాప్‌ పెట్టుబడి పథకాలు ఇవే..!
Investment Tips
Nikhil
|

Updated on: Sep 02, 2023 | 5:00 PM

Share

భవిష్యత్‌ అవసరాలకు కోసం ప్రస్తుత సంపాదనలో కొంత మొత్తాన్ని పొదుపు చేయాలని ఆర్థిక నిపుణులు ఎల్లప్పుడూ సూచిస్తూ ఉంటారు. మంచి రాబడి కోసం సరైన పొదుపు సాధనాల్లో పెట్టుబడి పెట్టడం అనేది తప్పనిసరి. ముఖ్యంగా పెట్టుబడి ప్రణాళిక, అలాగే సరైన పొదుపు సాధనాలను ఎంచుకోవడం అవసరం. ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్‌లో అత్యంత ముఖ్యమైన అంశాల్లో ఆదాయ సమూహం కూడా ఒకటి. ఇది మనం పెట్టుబడి పెట్టగల డబ్బును నిర్ణయిస్తుంది. కాబట్టి ఆదాయం ఆధారంగా భారతదేశంలోని కొన్ని ఉత్తమ పెట్టుబడి ఎంపికల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. తక్కువ ఆదాయ సమూహంలో ఉన్న వ్యక్తులు  అంటే సంవత్సర ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉండే వ్యక్తులకు అనువుగా ఉండే పెట్టుబడి పథకాల గురించి తెలుసుకుందాం.

రికరింగ్ డిపాజిట్లు 

ఈ పెట్టుబడి ఎంపిక ప్రతి నెలా నిర్దిష్ట మొత్తాన్ని ఆదా చేయడానికి అనుమతిస్తుంది. ఇది పెట్టుబడి ప్రణాళిక సమయంలో పరిగణించవలసిన ఉత్తమ ఎంపికలలో ఒకటి. ముఖ్యంగా పెట్టుబడిదారుల పొదుపు ఖాతాల కంటే ఈ పథకం మెరుగైన వడ్డీ రేట్లను అందిస్తారు.

సేవింగ్స్ ఖాతా

పెట్టుబడి భద్రతతో పాటు లిక్విడిటీ, వడ్డీ ప్రయోజనాలను ఆస్వాదించడానికి మీరు చిన్న మొత్తాలను ఆదా చేసుకోవచ్చు. వడ్డీ రేటు ఆర్‌డీల కంటే కొంచెం తక్కువగా ఉంటుంది కానీ లిక్విడిటీని అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 

పీపీఎఫ్‌ అనేది పన్ను ప్రయోజనాలతో కూడిన దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపిక. మొదలుపెట్టిన 15 ఏళ్ల వరకూ సొమ్ము విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి పీపీఎఫ్‌ రాబడి అనేది పెద్ద మొత్తంలో అందుతుంది. ఈ పథకం ద్వారా పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు. అలాగే పీపీఎఫ్‌ వడ్డీని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రమాదరహిత పెట్టుబడిదారులకు ఇది సరైన ఎంపిక.

రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం ఉన్న వారి పెట్టుబడి ఎంపికలు

ఫిక్స్‌డ్ డిపాజిట్లు 

ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ ఫండ్స్‌ని కోల్పోయే ప్రమాదం దాదాపు శూన్యం. కాబట్టి పెట్టుబడి భద్రతతో పాటు ఉదారమైన రాబడిని అందిస్తాయి. అయినప్పటికీ ఎఫ్‌డీ మెచ్యూర్ అయ్యే వరకు డిపాజిట్ చేసిన డబ్బును ఉపసంహరించుకోలేరు. తప్పనిసరి పరిస్థితుల్లో విత్‌డ్రా చేయాల్సి వస్తే వడ్డీని కోల్పోవాల్సి ఉంటుంది. 

మ్యూచువల్ ఫండ్‌లు

తక్కువ ఆదాయ సమూహం కంటే ఎక్కువ ఆదాయంతో రిస్క్‌తో కూడిన పెట్టుబడులను కూడా పరిగణించవచ్చు. వారు అందించే ఆకర్షణీయమైన రాబడి కారణంగా మ్యూచువల్ ఫండ్‌లు గొప్ప ఎంపిక. అదనంగా అవి పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడంలో సహాయపడతాయి. సరైన పెట్టుబడి ప్రణాళికను అనుసరిస్తే రిస్క్ మేనేజ్‌మెంట్‌లో సహాయపడతాయి.

సావరిన్ గోల్డ్ బాండ్స్ 

ఎస్‌జీపీల్లో పెట్టుబడి పెట్టడం బంగారం కొనుగోలుతో సమానం. అయితే ఇది కాగితం రూపంలో ఉంటుంది. ఈ బాండ్‌లు గణనీయమైన మొత్తంలో వడ్డీని అందిస్తాయి. ప్రభుత్వం వాటికి మద్దతు ఇస్తున్నందున ప్రమాద రహితంగా ఉంటాయి. అంతేకాకుండా బంగారం ధరలతో ముడిపడి ఉన్న కారణంగా దీన్ని మూలధన విలువ కూడా పెరుగుతుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి