Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIP Investment: నెలకు రూ.2000 పెట్టుబడితో రూ.1.62 లక్షల రాబడి.. ఆ బ్యాంక్‌ ఎస్‌ఐపీల్లో పెట్టుబడితో నికరమైన ఆదాయం

ప్రతి నెలా చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరాల తరబడి పెద్ద ఫండ్‌గా ఎదిగే అవకాశం ఉంది. అయితే ఎస్‌ఐపీల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు మంచి ప్లాన్‌ను ఎంచుకోవాలిని గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్ ఎస్‌ఐపీల మంచి ఎంపికల శ్రేణిని అందిస్తుంది. ఇక్కడ మీరు స్థిరమైన మొత్తాన్ని మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్‌లో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలి.

SIP Investment: నెలకు రూ.2000 పెట్టుబడితో రూ.1.62 లక్షల రాబడి.. ఆ బ్యాంక్‌ ఎస్‌ఐపీల్లో పెట్టుబడితో నికరమైన ఆదాయం
Sip
Follow us
Srinu

|

Updated on: Jul 09, 2023 | 7:30 PM

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు (ఎస్‌ఐపీలు) ప్రతి నెలా చిన్న పెట్టుబడులతో కార్పస్ ఫండ్‌ను నిర్మించడంలో మీకు సహాయపడతాయి. నిర్దిష్ట వ్యవధిలో చిన్న మొత్తాల్లో పెట్టుబడి క్రమెపీ పెద్ద ఫండ్‌గా పెరుగుతుంది. ప్రతి నెలా చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరాల తరబడి పెద్ద ఫండ్‌గా ఎదిగే అవకాశం ఉంది. అయితే ఎస్‌ఐపీల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు మంచి ప్లాన్‌ను ఎంచుకోవాలిని గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్ ఎస్‌ఐపీల మంచి ఎంపికల శ్రేణిని అందిస్తుంది. ఇక్కడ మీరు స్థిరమైన మొత్తాన్ని మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్‌లో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలి. అయితే ఎస్‌ఐపీల వల్ల కలిగే లాభాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

మార్కెట్ అస్థిరత నుంచి రక్షణ

ఎస్‌ఐపీలు మీ పెట్టుబడి ప్రక్రియను సులభతరం చేస్తాయి. అలాగే ఎస్‌ఐపీల ద్వారా మ్యూచువల్ ఫండ్‌లలో నెలకు 500 రూపాయల చిన్న మొత్తాలతో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. అయితే మీ ఎస్‌ఐపీల రిటర్న్‌లు వాటి హెచ్చు తగ్గులను కలిగి ఉంటాయని గమనించాలి. అయితే మార్కెట్ మార్పులు, మీరు ఎంచుకునే నిర్దిష్ట మ్యూచువల్ ఫండ్‌ ఎస్‌ఐపీలు మీ పెట్టుబడి శక్తిని ప్రభావితం చేస్తాయి. ఇది మార్కెట్ గరిష్ట, కనిష్ట స్థాయిలను అంచనా వేయడంలో మీకు సాయం చేస్తాయి. పెట్టుబడిదారులు బహుళ మ్యూచువల్ ఫండ్‌లను ఎంచుకుంటే అది మార్కెట్ అస్థిరత ద్వారా ఎదురయ్యే నష్టాలను తగ్గించడంలో మీకు సహాయపడుతుంది.

ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎస్‌ఐపీలు ఇవే

ఐసీఐసీఐ బ్యాంక్ వర్గాల్లో విస్తృతమైన మ్యూచువల్ ఫండ్‌లను అందిస్తుంది. బ్లూ చిప్ ఈక్విటీ ఆప్షన్‌ల నుంచి కమోడిటీస్ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ వరకు అన్ని రిస్క్ ఎపిటైట్స్ కోసం మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఈ ఫండ్‌లు మీ పెట్టుబడి ప్రయాణానికి మార్గనిర్దేశం చేసే అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారని గుర్తుంచుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ గత పనితీరు భారీ రాబడిని సూచించినా భవిష్యత్‌ కోసం అవి ఎలాంటి హామీని ఇవ్వదని గుర్తుంచుకోవాలి. ఐసీఐసీ బ్యాంక్ ఎస్‌ఐపీలు మ్యూచువల్ ఫండ్స్ రంగంలోకి ప్రవేశించడానికి సరళీకృత మార్గాన్ని అందిస్తాయి. అలాగే మీ పెట్టుబడిని కాలక్రమేణా విస్తరించే అవకాశం కూడా ఉంటుంది. మీ సంపదను సంభావ్యంగా పెంచడానికి సమ్మేళన శక్తిని ఉపయోగించుకోవచ్చు. అయితే మీ రాబడిని మార్కెట్ పరిస్థితులు, ఎంచుకున్న ఫండ్ పనితీరుపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. 

ఇవి కూడా చదవండి

రూ.2000తో రాబడి ఇలా

మీరు ఐసీఐసీఐ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్‌లో ఐదు సంవత్సరాల పాటు ఎస్‌ఐపీ ద్వారా ప్రతి నెలా రూ. 2,000 పెట్టుబడి పెట్టాలి. ఇలా చేస్తే సగటు వార్షిక రాబడిని 12 శాతంగా ఉంటుంది. ఐదేళ్ల ముగిసే సమయానికి మీ పెట్టుబడి మొత్తం రూ.1,20,000 చేరుకుంటుంది. అయితే మీ పెట్టుబడికి వార్షిక రాబడితో కలిపి ఐదేళ్లల్లో 1,62,000కు చేరుకుంటుంది. అంట మీ పెట్టుబడిపై రూ.42000 లాభం వస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు