Mutual Fund: ప్రతిరోజు 50 రూపాయలు ఆదా చేస్తే.. పదవీ విరమణ సమయంలో రూ.3 కోట్లు!

చిన్న వయస్సులో పెట్టుబడి: ఆధునిక కాలంలో అనేక పెట్టుబడి ఆప్షన్స్‌ ఉన్నాయి. చిన్నవయసులోనే పెట్టుబడి పెడితే ఆ తర్వాత ఇబ్బంది ఉండదు. చాలా మంది వ్యక్తులు తమ పెట్టుబడి ఎంపికను వృద్ధాప్యంలో ప్రారంభిస్తారు. దీని కారణంగా వారు మంచి మొత్తాన్ని కూడబెట్టుకునే..

Mutual Fund: ప్రతిరోజు 50 రూపాయలు ఆదా చేస్తే.. పదవీ విరమణ సమయంలో రూ.3 కోట్లు!
Mutual Fund
Follow us
Subhash Goud

|

Updated on: May 13, 2023 | 4:32 PM

చిన్న వయస్సులో పెట్టుబడి: ఆధునిక కాలంలో అనేక పెట్టుబడి ఆప్షన్స్‌ ఉన్నాయి. చిన్నవయసులోనే పెట్టుబడి పెడితే ఆ తర్వాత ఇబ్బంది ఉండదు. చాలా మంది వ్యక్తులు తమ పెట్టుబడి ఎంపికను వృద్ధాప్యంలో ప్రారంభిస్తారు. దీని కారణంగా వారు మంచి మొత్తాన్ని కూడబెట్టుకునే అవకాశాన్ని కోల్పోతారు. లో ఎడ్జ్‌లో పెట్టుబడి పెడితే కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. మీరు మ్యూచువల్ ఫండ్స్ SIPలో ప్రతిరోజూ కేవలం 50 రూపాయలు పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, పదవీ విరమణ వయస్సు వరకు మీకు కోట్ల రూపాయలు లభిస్తాయి. మీరు 10 లేదా 12వ తరగతి చదువుతున్నవారైతే కోటి రూపాయలను అందుకే మంచి అవకాశం ఉంది.

10వ తరగతి నుంచి సిప్‌ ద్వారా పెట్టుబడి

మీరు విద్యార్థి అయితే, పదో తరగతి నుంచి పెట్టుబడి పెట్టాలనుకుంటే, మీరు రోజుకు రూ.50 ఆదా చేయడం ప్రారంభించవచ్చు. ప్రతిరోజూ 50 రూపాయలు అంటే నెలకు 1500 రూపాయలు ఇన్వెస్ట్‌ చేయాలి. ఈ మొత్తం ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్స్‌కు చేరుతాయి.

ఎంత మొత్తం డిపాజిట్ చేస్తారు

గణన ప్రకారం.. 45 సంవత్సరాల పాటు లేదా 60 సంవత్సరాల పదవీ విరమణ వయస్సు వరకు ప్రతి నెలా 1500 పెట్టుబడి పెట్టడం ద్వారా ఒక వ్యక్తి 12% వార్షిక రాబడితో 3.32 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని పొందవచ్చు. ఈ రాబడి 10% ఉంటే, 60 ఏళ్ల వయస్సులోపు మీ డిపాజిట్ మొత్తం రూ. 1.5 కోట్లు అవుతుంది.

ఇవి కూడా చదవండి

12వ తరగతి తర్వాత పెట్టుబడి

మీరు 12వ తరగతి తర్వాత సిప్‌ ద్వారా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే మీ వయస్సు 17 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉంటే, అలాగే ప్రతి నెల పెట్టుబడి రూ. 1500 అయితే, 40 సంవత్సరాల వయస్సు వరకు మీరు 12% రాబడితో రూ.1.78 కోట్లు పొందవచ్చు. అదే సమయంలో, 10 శాతం వార్షిక రాబడితో 60 ఏళ్ల వయస్సు వరకు రూ.95 లక్షలు వసూలు చేయవచ్చు. అయితే, మీరు రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలనుకుంటే, మీరు PPF NSC వంటి ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి