Business Ideas: ఉద్యోగం కోసం ఎదురు చూడొద్దు..ఈ బిజినెస్ చేస్తే NRIల కన్నా కూడా ఎక్కువగా సంపాదించే అవకాశం.. ట్రై చేయండి..

నిరుద్యోగ యువత వ్యాపారం కోసం ఎదురుచూస్తున్నరా.. అయితే ఓ చక్కటి వ్యాపార అవకాశం గురించి ఇప్పుడు మీరు తెలుసుకోండి.

Business Ideas: ఉద్యోగం కోసం ఎదురు చూడొద్దు..ఈ బిజినెస్ చేస్తే NRIల కన్నా కూడా ఎక్కువగా సంపాదించే అవకాశం.. ట్రై చేయండి..
business ideas
Follow us
Madhavi

|

Updated on: May 13, 2023 | 11:28 AM

నిరుద్యోగ యువత వ్యాపారం కోసం ఎదురుచూస్తున్నరా.. అయితే ఓ చక్కటి వ్యాపార అవకాశం గురించి ఇప్పుడు మీరు తెలుసుకోండి. ఈ వ్యాపారం చేయడం ద్వారా మీరు నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. వ్యాపారంలో ఫుడ్ బిజినెస్ విషయానికి వస్తే చాలా చక్కటి బిజినెస్ అనే చెప్పాలి. నాణ్యత, రుచి పాటిస్తే ఫుడ్ బిజినెస్ లో తిరుగు ఉండదని చెప్పవచ్చు. ముఖ్యంగా నిరుద్యోగ యువత ఫుడ్ బిజినెస్ విషయంలో వినూత్నంగా ట్రై చేస్తే మాత్రం చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. అలాంటి ఓ ఫుడ్ బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కర్రీ పాయింట్ స్థాపించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది. ముఖ్యంగా కర్రీ పాయింట్స్ లో నాన్ వెజ్ ఐటమ్స్ కు చక్కటి డిమాండ్ ఉంటుంది అందులో కూడా చేపల పులుసు కు చాలా డిమాండ్ ఉంటుంది. ఈ మధ్యకాలంలోనే జబర్దస్త్ యాక్టర్ గా ఒక వెలుగు వెలిగిన ప్రముఖ కమెడియన్ కిరాక్ ఆర్పి నెల్లూరు చేపల పులుసు పేరిట ఓ కర్రీ పాయింట్ స్థాపించి చాలా సక్సెస్ ఫుల్ గా ఎదిగిన సంగతి అందరికీ తెలిసిందే. మీరు కూడా సక్సెస్ అవ్వాలంటే కర్రీ పాయింట్ విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మంచి ఆదాయం పొందే వేయడం ఉంది.

సాధారణ కర్రి పాయింట్ లాగా కాకుండా మీరు రుచికరంగాను మీ సమీప ప్రాంతంలో దొరకని ఒక అరుదైన వంటకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా మీ కర్రీ పాయింట్ ఫేమస్ అయ్యే అవకాశం ఉంది ఉదాహరణకు ఒక ప్రాంతానికి చెందిన చేపల పులుసు లేదా బిరియాని లేదా మరేదైనా నాన్ వెజ్ ఐటమ్ ప్రవేశపెట్టినట్లయితే మీ కర్రీ పాయింట్ ఫేమస్ అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు మీరు బిర్యాని చేయడంలో నిష్ణాతులు అయినట్లయితే. ఒక చక్కటి బ్రాండ్ నేమ్ మీ కర్రీ పాయింట్ పేరుగా మార్చుకొని ఆ బిర్యానీని అందుబాటులో వచ్చినట్లయితే భోజన ప్రియుడు వెతుక్కుని వచ్చి మరి తింటారు.

ఇవి కూడా చదవండి

ఒకవేళ మీరు నాన్ వెజ్ పికిల్స్ చేయడంలో సిద్ధహస్తులైనట్లయితే మీ కర్రీ పాయింట్ లో వాటిని విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇక కర్రీ పాయింట్ విషయంలో అన్నింటికన్నా ప్రధానమైనది నాణ్యత, రుచి, పరిశుభ్రత. ఈ మూడు సూత్రాలు పాటిస్తే మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది.

అయితే కర్రీ పాయింట్ విషయానికి వస్తే దాన్ని ఎక్కడ పెడితే లాభము ముందుగా బేరీజు వేసుకోవాలి. ఫ్యామిలీలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో కర్రీ పాయింట్ స్థాపించే నడవకపోవచ్చు ఎందుకంటే ఫ్యామిలీలు ఇంట్లో వంట చేసుకుంటాయి. బ్యాచిలర్స్ విద్యార్థులు వ్యాపారస్తులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ కర్రీ పాయింట్స్ సక్సెస్ అవుతూ ఉంటాయి. . అందుకే మీరు కూడా ఈ వ్యాపారం లోకి దిగేముందు మార్కెట్ ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే పెట్టుబడి పెట్టే ముందుందు మీరు స్వయంగా వంట చేయడం వచ్చినట్లయితే, కర్రీ పాయింట్ చాలా సక్సెస్ ఫుల్ గా రన్ చేయవచ్చు లేకపోతే పనివాళ్ళు దొరకని రోజు మీ కర్రీ పాయింట్ మూతపడే ప్రమాదం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ ఐడియాస్ వార్తల కోసం