AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: డిగ్రీ చేసి కూడా ఖాళీగా ఉన్నారా.? జస్ట్ రూ. 20 వేల పెట్టుబడితో నెలకు రూ. లక్ష సంపాదన.!

డిగ్రీలు చేసినా.. ఇంట్లో ఖాళీగానే ఉన్నారా..! ఎక్కడా కూడా జాబ్ దొరకట్లేదా.? అయితే ఇది మీకోసమే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ఈ బిజినెస్ ఐడియా ఫాలో అయిపోండి.

Business Ideas: డిగ్రీ చేసి కూడా ఖాళీగా ఉన్నారా.? జస్ట్ రూ. 20 వేల పెట్టుబడితో నెలకు రూ. లక్ష సంపాదన.!
Business idea
Ravi Kiran
|

Updated on: Apr 20, 2023 | 8:37 PM

Share

డిగ్రీలు చేసినా.. ఇంట్లో ఖాళీగానే ఉన్నారా..! ఎక్కడా కూడా జాబ్ దొరకట్లేదా.? అయితే ఇది మీకోసమే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ఈ బిజినెస్ ఐడియా ఫాలో అయిపోండి. రిస్క్ ఉండదు.. మినిమం పెట్టుబడి.. వర్కౌట్ అయితే లాభాలే.. లాభాలు. అనువైన చోట మీ వ్యాపారాన్ని ప్రారంభించండి.. సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయండి. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటని అనుకుంటున్నారా.? అయితే ఇవిగో దీటయిల్స్ చూసేయ్యండి..

ఫుడ్ బిజినెస్.. ఇది ఎప్పుడూ డిమాండ్ ఉండే వ్యాపారం. ముఖ్యంగా పట్టణాలు, సిటీల్లో ఈ బిజినెస్‌ స్టార్ట్ చేసి.. సక్సెస్‌ఫుల్ కావొచ్చు. అక్కడ చాలామంది ఉద్యోగస్తులు, వ్యాపారం చేసుకునేవారు ఇంట్లో కన్నా.. బయటే ఎక్కువగా తింటుంటారు. అలాంటి వారి కోసం మీరు పరాటా బిజినెస్‌ను స్టార్ట్ చేసేయండి. ఈ మధ్యకాలంలో చాలామంది మధ్యాహ్నం వేళ భోజనం కంటే పరాటాలు, చపాతీలు తింటున్నారు. గోధుమ పిండి పరాటాలతో ఆలుగడ్డ, ముల్లంగి, పనీర్, చికెన్, మటన్ కర్రీలను వాడుతుంటారు. మీరు కూడా మంచి రద్దీ ఉన్న సెంటర్ చూసి.. ఈ పరాటా ఫుడ్ స్టాల్‌ను ఏర్పాటు చేయండి. ఒక షాపు అద్దెకు తీసుకుని అయినా ప్రారంభించవచ్చు.

ఇక ఈ పరాటా సెంటర్ మొదలుపెట్టేందుకు ముందుగా మీరు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకోవాలి. ఆ తర్వాత పరాటాల తయారీకి కావాల్సిన సామాగ్రిని సిద్దం చేసుకోవాలి. వీటికి దాదాపు రూ. 20 వేల వరకు ఖర్చవుతుంది. కాగా, ఒక పరాటా ధర రూ. 20 అనుకుంటే.. మీరు రోజుకు 100 అమ్మితే.. రూ. 2 వేల వరకు వస్తుంది. ఇక నాన్ వెజ్ పరాటాలైతే అదనంగా ఛార్జీ చేయవచ్చు. ఇక ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జోమాటోలతో ఒప్పందం కుదుర్చుకుంటే.. ఇంకా ఎక్కువగా ఆదాయాన్ని ఆర్జించవచ్చు. దాదాపు నెలకు రూ. లక్ష వరకు సంపాదన వచ్చే అవకాశం ఉంది.

Follow Us
AC సామర్థ్యాన్ని టన్నులలో ఎందుకు కొలుస్తారు? అసలు సీక్రెట్‌ ఇదే!
AC సామర్థ్యాన్ని టన్నులలో ఎందుకు కొలుస్తారు? అసలు సీక్రెట్‌ ఇదే!
హైదరాబాద్‌లో 15వ BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం ముగింపు.. AIపై కీలక..
హైదరాబాద్‌లో 15వ BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం ముగింపు.. AIపై కీలక..
తక్కువ ఎత్తు ఉన్నవారికి బెస్ట్ క్రూజర్ బైక్‌లు..బడ్జెట్ ఫ్రెండ్లీ
తక్కువ ఎత్తు ఉన్నవారికి బెస్ట్ క్రూజర్ బైక్‌లు..బడ్జెట్ ఫ్రెండ్లీ
జూలై 23-24 తేదీల్లో 'విశ్వ మాంగల్య సభ' ఉత్తర భారత సదస్సు..
జూలై 23-24 తేదీల్లో 'విశ్వ మాంగల్య సభ' ఉత్తర భారత సదస్సు..
కాయగూరలు లేనప్పుడు 10 నిమిషాల్లో చేసుకొనే కారం అన్నం!
కాయగూరలు లేనప్పుడు 10 నిమిషాల్లో చేసుకొనే కారం అన్నం!
వన్డే, టీ20 వరల్డ్ కప్ ఫార్మాట్లలో ఐసీసీ భారీ మార్పులు
వన్డే, టీ20 వరల్డ్ కప్ ఫార్మాట్లలో ఐసీసీ భారీ మార్పులు
హీరోయిన్ శ్రీదేవికి ఇంత పెద్ద కూతురుందా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ శ్రీదేవికి ఇంత పెద్ద కూతురుందా? ఫొటోస్ వైరల్
తిరుమలలో ఇచ్చే భక్తుల తలనీలాలను టీటీడీ ఏం చేస్తుంది?
తిరుమలలో ఇచ్చే భక్తుల తలనీలాలను టీటీడీ ఏం చేస్తుంది?
2027 వన్డే వరల్డ్ కప్ ఫార్మాట్ పూర్తిగా మార్పు
2027 వన్డే వరల్డ్ కప్ ఫార్మాట్ పూర్తిగా మార్పు
ఈ నాలుగు ప్రదేశాలలో మీకు కావలసినంత బంగారం ఉచితంగా లభిస్తుంది..!
ఈ నాలుగు ప్రదేశాలలో మీకు కావలసినంత బంగారం ఉచితంగా లభిస్తుంది..!