PM Kisan Yojana: ఇలాంటి వారు పీఎం కిసాన్‌ సాయం పొందుతున్నారా..? చర్యలు తప్పవు.. ఉపసంహరించుకోవడం ఎలా..?

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతుల ఖాతాలో సంవత్సరానికి 6000 రూపాయలు జమ చేస్తోంది కేంద్రం. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. కానీ, కొంత మంది తెలిసి తెలియక ఈ పథకంలో చేరారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం..

PM Kisan Yojana: ఇలాంటి వారు పీఎం కిసాన్‌ సాయం పొందుతున్నారా..? చర్యలు తప్పవు.. ఉపసంహరించుకోవడం ఎలా..?
PM Kisan
Follow us
Subhash Goud

|

Updated on: May 12, 2023 | 8:05 PM

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతుల ఖాతాలో సంవత్సరానికి 6000 రూపాయలు జమ చేస్తోంది కేంద్రం. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. కానీ, కొంత మంది తెలిసి తెలియక ఈ పథకంలో చేరారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఈ పథకంలో చేరలేని వారి గురించి పోర్టల్‌లో సమాచారం ఇచ్చింది కేంద్రం. అర్హులు ఈ పథకం పొందుతున్నట్లయితే వారు స్వచ్చంధంగా తప్పుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వారిపై చర్యలు తప్పవు.

పథకానికి అనర్హులు

  1. ప్రస్తుతం ఏదైనా రాజ్యాంగ పదవిలో ఉన్నవారు లేదా ఇంతకుముందు అలాంటి పదవిలో ఉన్నవారు ఈ పథకంప్రయోజనాన్ని పొందలేరు.
  2. ఒక రైతు గతంలో లేదా ప్రస్తుతం ఏదైనా రాష్ట్రానికి మంత్రిగా ఉన్నట్లయితే, లేదా లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా లేదా మునిసిపల్ కార్పొరేషన్‌కు మేయర్‌గా లేదా జిల్లా పంచాయతీకి చైర్‌పర్సన్‌గా ఉంటే, అప్పుడు అతను ఈ పథకానికి అనర్హుడు.
  3. ఒక వ్యక్తి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లేదా గ్రూప్-డిలో సభ్యుడిగా ఉండటమే కాకుండా, ఒక వ్యక్తి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోసం పనిచేస్తే లేదా గతంలో తన పదవి నుంచి పదవీ విరమణ చేసినట్లయితే అలాంటి వ్యక్తులు ఈ పథఖం పొందలేరు.
  4. ఒక వ్యక్తికి నెలకు రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ వస్తే, అతను కూడా ఈ పథకానికి అర్హులు కాదు.
  5. ఆదాయపు పన్ను చెల్లించే వారు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేరు.
  6. వీటన్నింటితో పాటు, వృత్తిపరంగా డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు లేదా ఏదైనా ఇతర రిజిస్టర్డ్ ప్రొఫెషనల్ పోస్ట్‌లో ఉన్న వ్యక్తులు కూడా ఈ పథకం నుంచి లాభం పొందలేరు.

PM కిసాన్ యోజనలో నుంచి తప్పుకోవడం ఎలా..?

ప్రధాన్ మంత్రి కిసాన్ యోజన కింద వీరిలో ఎవరైనా ప్రయోజనం పొందుతున్నట్లయితే అతను ఈ పథకం నుంచి స్వచ్చంధంగా తప్పుకోవాలి. తప్పుకోవడానికి 5 సులభమైన దశలను అనుసరించాలి.

  • పీఎం కిసాన్ యోజన pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • దీని తర్వాత ‘ప్రధాన మంత్రి కిసాన్ ప్రయోజనాల స్వచ్ఛంద సరెండర్’పై క్లిక్ చేయండి.
  • అందులో మీ రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి. అలాగే జనరేట్ OTPపై క్లిక్ చేయండి.
  • మొబైల్‌కు వచ్చిన OTPని నమోదు చేసిన తర్వాత మీరు తీసుకున్న అన్ని వాయిదాలు కనిపిస్తాయి.
  • దీని తర్వాత మీరు ఈ స్కీమ్ ప్రయోజనాన్ని పొందకూడదనుకుంటున్నారా ? సరెండర్ చేయాలనుకుంటున్నారా అనే ప్రశ్న కనిపిస్తుంది. దాని కోసం మీరు అవునుపై క్లిక్ చేయాలి.

ఈ దశలు పూర్తయిన వెంటనే, ఈ పథకం కోసం మీ తరపున సరెండర్ చేయబడుతుంది. దీనితో పాటు, ప్రభుత్వం తరపున ఇది చేసే వ్యక్తికి సర్టిఫికేట్ కూడా ఇవ్వబడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి