- Telugu News Photo Gallery Business photos Apple phones to be built in new 300 acre factory in Karnataka
Apple Phones: బెంగళూరులో యాపిల్ ఫోన్ల తయారీ ప్యాక్టరీ.. రూ.303 కోట్లతో భూమి కొనుగోలు
యాపిల్ కంపెనీ తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటోంది. వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటోంది. తయాగా దేశంలోని మరో నగరంలో ఐఫోన్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. Apple Inc భాగస్వామి Foxconn Technology Group బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలోని..
Updated on: May 12, 2023 | 2:43 PM

Apple Inc భాగస్వామి Foxconn Technology Group బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలోని దేవనహళ్లి ప్రాంతంలో 13 మిలియన్ చదరపు అడుగుల (1.2 మిలియన్ చదరపు మీటర్లు) స్థలాన్ని కొనుగోలు చేసింది.

నివేదికల ప్రకారం.. ఫాక్స్‌కాన్ అనుబంధ సంస్థ హాన్ హై టెక్నాలజీ ఇండియా మెగా డెవలప్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ విషయాన్ని లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎల్‌ఎస్‌ఇ)కి తెలియజేసింది.

బెంగళూరులోని ఈ భూమిని కంపెనీ 37 మిలియన్ డాలర్లు అంటే రూ.303 కోట్లకు కొనుగోలు చేసింది. ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ఈ భూమిలో తయారీ ప్లాంట్‌ను నిర్మించనుంది. కంపెనీ ఈ ప్లాంట్‌లో విడిభాగాలను తయారు చేయడంతో పాటు ఆపిల్ హ్యాండ్‌సెట్‌లను కూడా అసెంబుల్ చేస్తుంది.

Foxconn కొత్త ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం కోసం కొన్ని భాగాలను ఉత్పత్తి చేయడానికి కూడా ఈ సైట్‌ని ఉపయోగించవచ్చు.

ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ స్థానిక ఉత్పత్తిని పెంచడానికి భారతదేశంలో కొత్త ప్లాంట్‌పై సుమారు 700 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 5.7 వేల కోట్లు) పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక ఇంతకుముందు తెలిపింది.





























