Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Locker: లాకర్ నియమాలలో మార్పులు.. రిజర్వ్‌ బ్యాంకు కొత్త మార్గదర్శకాలు ఏంటో తెలుసుకోండి

బ్యాంకు లాకర్లను చాలా మంది సురక్షితమైన ప్రదేశాలుగా భావిస్తారు. విలువైన ఆభరణాల నుంచి ముఖ్యమైన పేపర్ల వరకు అన్నీ ఈ లాకర్ లోనే భద్రపరుస్తారు. మీకు లాకర్ కూడా ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ మేరకు ఇప్పటికే..

Bank Locker: లాకర్ నియమాలలో మార్పులు.. రిజర్వ్‌ బ్యాంకు కొత్త మార్గదర్శకాలు ఏంటో తెలుసుకోండి
Bank Locker
Follow us
Subhash Goud

|

Updated on: May 12, 2023 | 9:45 PM

బ్యాంకు లాకర్లను చాలా మంది సురక్షితమైన ప్రదేశాలుగా భావిస్తారు. విలువైన ఆభరణాల నుంచి ముఖ్యమైన పేపర్ల వరకు అన్నీ ఈ లాకర్ లోనే భద్రపరుస్తారు. మీకు లాకర్ కూడా ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ మేరకు ఇప్పటికే బ్యాంకులకు ఆదేశాలు అందాయి. బ్యాంకులు లాకర్ కాంట్రాక్టులను పునరుద్ధరించాలని ఆర్‌బీఐ తెలిపింది. ఆ గైడ్‌లో కస్టమర్‌లు కొన్ని వస్తువులను ఉంచుకోవచ్చని తెలిపింది.

కొత్త నిబంధనల ప్రకారం.. కొత్త కస్టమర్లు లాకర్లలో చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లు, ఆభరణాలను మాత్రమే ఉంచుకోవచ్చు. కాంట్రాక్టు పునరుద్ధరణ సమయంలో ఏమి ఉంచుకోవచ్చో బ్యాంక్ మీకు తెలియజేస్తుంది. అంతే కాదు లాకర్‌ను కస్టమర్ తన వ్యక్తిగత ఉపయోగం కోసం మాత్రమే ఉపయోగించవచ్చు. దానిని ఎవరికీ బదిలీ చేయలేరు. దీనికి సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మోడల్ ఒప్పందాన్ని సిద్ధం చేస్తోంది.

ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి స్టాంప్ పేపర్ ఖర్చును బ్యాంక్ అథారిటీ భరిస్తుంది. అయితే, కొత్త లాకర్ పొందడానికి కస్టమర్ స్టాంప్ పేపర్ ధరను చెల్లించాలి. అనేక వస్తువులను ఉంచడానికి పరిమితులు ఉన్నాయి. చట్టపరమైన చెల్లుబాటు లేకుండా ఏదీ ఉంచకూడదు. అవి నగలు అయినా డాక్యుమెంట్లు అయినా. అలాగే ఏ కస్టమర్ విదేశీ డబ్బును ఉంచుకోలేరు. ఆయుధాలు, మందులు, విషపూరిత వస్తువులు ఉంచరాదని గుర్తించుకోండి.

ఇవి కూడా చదవండి

మరోవైపు, కొత్త నిబంధనలు బ్యాంకులు అనేక బాధ్యతలను మాఫీ చేయడానికి అనుమతిస్తాయి. లాకర్ పాస్‌వర్డ్‌ను చట్టవిరుద్ధంగా ఉపయోగించినట్లయితే కస్టమర్ బాధ్యత వహించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి