Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIP Investments: రోజుకు రూ.50 పెట్టుబడితో రూ.30 లక్షల రాబడి.. ఎలాగో తెలుసుకోవాలంటే ఓ లుక్కెయ్యండి..

మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. అయితే ఇందులోని క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ నుంచి మీరు ఊహించలేనంత రాబడి వస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెగ్యులర్ ప్లాన్ 1996లో ప్రారంభమైంది. అప్పటి నుంచి దాదాపు 11.47 శాతం రాబడిని అందించగా గత మూడేళ్లల్లో ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెడితే దాదాపు 47.25 శాతం, డైరెక్ట్ ప్లాన్ ద్వారా అయితే 49.35 శాతం వార్షిక రాబడి వచ్చింది.

SIP Investments: రోజుకు రూ.50 పెట్టుబడితో రూ.30 లక్షల రాబడి.. ఎలాగో తెలుసుకోవాలంటే ఓ లుక్కెయ్యండి..
Systematic Investment Scheme
Follow us
Srinu

|

Updated on: Mar 03, 2023 | 4:30 PM

భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అందరూ పెట్టుబడి పెడుతుంటారు. అయితే తమ రాబడికి అనుగుణంగా పొదుపు చేయాలని నిర్ణయించుకుంటారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఓ కొత్త పెట్టుబడి సాధనాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఇందులో రోజుకు రూ.50 అంటే నెలకు రూ.1500 పెట్టుబడి పెడితే ఏకంగా రూ.30 లక్షల వరకూ రాబడి వస్తుంది. మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. అయితే ఇందులోని క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ నుంచి మీరు ఊహించలేనంత రాబడి వస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెగ్యులర్ ప్లాన్ 1996లో ప్రారంభమైంది. అప్పటి నుంచి దాదాపు 11.47 శాతం రాబడిని అందించగా గత మూడేళ్లల్లో ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెడితే దాదాపు 47.25 శాతం, డైరెక్ట్ ప్లాన్ ద్వారా అయితే 49.35 శాతం వార్షిక రాబడి వచ్చింది. అంటే మూడేళ్లల్లో నెలవారీ పెట్టుబడి రూ.1500 ప్రస్తుతం 1.2 లక్షలకు పెరిగింది. 

క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ స్మాల్-క్యాప్ కంపెనీల పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడి పెట్టడం ద్వారా క్యాపిటల్ అప్రిసియేషన్‌ను ఉత్పత్తి చేయడం, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం దాని పెట్టుబడి లక్ష్యం నెరవేరుతుందని ఎటువంటి హామీ ఇవ్వనప్పటికీ, స్మాల్ క్యాప్ ఫండ్ సంవత్సరాలుగా మంచి రాబడిని ఇస్తుందనేది మాత్రం వాస్తవం. గత మూడేళ్లలో ఇతర స్మాల్ క్యాప్ ఫండ్స్‌తో పోలిస్తే ఇది అత్యధిక రాబడిని కూడా ఇచ్చింది. ఫిబ్రవరి 2023 కోసం క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఫ్యాక్ట్‌షీట్ ప్రకారం ఈ  పథకం పెట్టుబడిదారులను కనిష్ట మొత్తంలో 5000తో పెట్టుబడి పెట్టడం ప్రారంభించి, రూ. 1000 మరియు ఆ తర్వాత రూ. 1 నుంచి పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది. స్మాల్-క్యాప్ ఫండ్ తన ఆస్తుల్లో 12.45% బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టింది. దాని తర్వాత డైవర్సిఫైడ్ ఎఫ్‌ఎంసీసీ 9.39%, కన్స్ట్రక్షన్ 6.74&, ఫెర్రస్ మెటల్స్ 5.74%, ఫార్మాస్యూటికల్స్ 5.2%తో పాటు ఇతర సంస్థల్లో పెట్టుబడి పెట్టింది. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఎన్ఏవీలోని టాప్ 10 హోల్డింగ్‌లలో కలిపి 44.19% శాతం వాటా ఉంది. మొత్తంమీద, ఫండ్ తన ఆస్తులలో 95.34% ఈక్విటీతో పాటు ఈక్విటీ సంబంధిత సాధనాల్లో పెట్టుబడి పెట్టింది. అలాగే ఆస్తుల్లో 4.6% నగదు ఇతర స్వీకరించదగిన సాధనాలు  ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..