EV Scooters: మార్కెట్‌లోకి Kinetic Zing.. నో లైసెన్స్.. నో రిజిస్ట్రేషన్.. రోడ్లపైకి రయ్..రయ్..
ముఖ్యంగా రిజిస్ట్రేషన్ గానీ, లైసెన్స్ కానీ లేకుండా గృహ అవసరాల వినియోగదారులను టార్గెట్ చేస్తూ కొన్ని మోడల్స్ పలకరిస్తున్నారు. కైనెటిక్ జింగ్ కూడా ఇలాంటి కొత్త ఈవీ స్కూటర్‌ను మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కూటర్‌లో మల్టీ-ఫంక్షనల్ రిమోట్ కీ సౌలభ్యం ఉంటుంది.
ప్రస్తుత కాలంలో స్కూటర్ కానీ, బైక్ గానీ లేకుండా బయటకు వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్నదో పెద్దదో ఏదో టూ వీలర్‌ను అందుబాటులో ఉంచుకుంటున్నారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్తే ఒక్కోసారి పోలీస్ చెకింగ్స్, లైసెన్సులు లేక ఇబ్బంది పడతాం. ముఖ్యంగా గృహిణులు వంట సంబంధిత సామగ్రి తెచ్చుకోవడానికి బయటకు వెళ్లడానికి ఇబ్బంది పడతారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పెరుగుతున్న ఇందన ధరల దెబ్బకు టూ వీలర్ల నిర్వహణ కూడా కష్టంగా మారింది. దీంతో అందరూ ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు కంపెనీలు కొత్త కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ గానీ, లైసెన్స్ కానీ లేకుండా గృహ అవసరాల వినియోగదారులను టార్గెట్ చేస్తూ కొన్ని మోడల్స్ పలకరిస్తున్నారు. కైనెటిక్ జింగ్ కూడా ఇలాంటి కొత్త ఈవీ స్కూటర్‌ను మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కూటర్‌లో మల్టీ-ఫంక్షనల్ రిమోట్ కీ సౌలభ్యం ఉంటుంది. యాంటీ-థెఫ్ట్ అలారం, కీలెస్ ఎంట్రీ, ఫైండ్ మై స్కూటర్ అలర్ట్, లాక్/అన్‌లాక్ బటన్ వంటి ఫీచర్‌లతో ఈ స్కూటర్ ప్రతి ఒక్కరి అవసరాలకు అనుకూలంగా ఉంటుంది.
కెనటిక్ గ్రీన్ జింగ్ స్పెసిఫికేషన్లు ఇవే
ఈ స్కూటర్‌లొ ఉండే హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌ల వల్ల కఠినమైన రోడ్లల్లో కూడా మృధువైన, సౌకర్యవంతమైన రైడ్‌ను పొందవచ్చు. ఈ స్కూటర్‌లో 60వీ వీ22ఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ వస్తుంది. ఈ బ్యాటరీని ఓ సారి చార్జ్ చేస్తే 80 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తంది. ఈ మైలేజ్ రోజువారీ ప్రయాణాలకు సరైంది. ముఖ్యంగా ఇవి రిమూవబుల్ బ్యాటరీల కారణంగా ఇంట్లో చార్జ్ చేసుకోడానికి సౌకర్యంగా ఉంటుంది. అలాగే కేవలం మూడు నుంచి నాలుగు గంటల్లో బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవ్వడం దీని ప్రత్యేకత. స్పీడ్ స్విచ్‌తో పాటు మూడు-స్పీడ్ మోడ్‌లతో ఈ స్కూటర్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. సాధారణ, ఎకో, పవర్ అనే మూడు మోడ్స్‌తో మీ అవసరాన్ని బట్టి వివిధ మోడ్‌లను మార్చుకుంటూ సులభంగా ప్రయాణించడానికి అనుమతిస్తుంది. అలాగే ఈ స్కూటర్‌లో మీ ఫోన్ చార్జ్ చేసుకునేలా యూఎస్‌బీ సాకెట్ వస్తుంది. అలాగే బ్యాటరీ స్థాయి, పార్ట్-ఫెయిల్యూర్, ట్రిప్ మీటర్, పార్కింగ్ సూచికలను స్కూటర్ గైడ్ చేస్తుంది. అలాగే ఈ స్కూటర్ స్థితిని ట్రాక్ చేయడం కూడా సులభంగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..