Aera electric bike: స్పోర్ట్స్ లుక్‌లో కేక పెట్టిస్తున్న ‘ఏరా’.. ఒక్కసారి చార్జ్ చేస్తే 125 కి.మీ.. నాలుగు గేర్లతో దూసుకెళ్లొచ్చు..
దేశీయ విద్యుత్ వాహనాల తయారీ కంపెనీ మ్యాటర్ ఎనర్జీ కూడా తన తొలి ఎలక్ట్రిక్ బైక్ ని లాంచ్ చేసింది. ఏరా పేరుతో దీనిని ఆవిష్కరించింది.

మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో కంపెనీలు కూడా అత్యాధునిక ఫీచర్లతో కూడిన బైక్ లను అందించేందుకు పోటీ పడుతున్నాయి. ఇదేక్రమంలో దేశీయ విద్యుత్ వాహనాల తయారీ కంపెనీ మ్యాటర్ ఎనర్జీ కూడా తన తొలి ఎలక్ట్రిక్ బైక్ ని లాంచ్ చేసింది. ఏరా పేరుతో దీనిని ఆవిష్కరించింది. ఏరా 4000, ఏరా 5000, ఏరా 5000 ప్లస్, ఏరా 6000 ప్లస్ పేర్లతో పలు వేరియంట్లను ప్రకటించింది. అయితే వీటిల్లో ప్రస్తుతం ఏరా 5000, ఏరా 5000 ప్లస్ వాహనాలు మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ధర ఎంత అంటే..
మేటర్ ఎనర్జీ ఆవిష్కరించిన కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఏరా 5000 ధర రూ. 1,43,999 లక్షలు(ఎక్స్ షోరూం) కాగా, 5000 ప్లస్ వేరియంట్ ధర రూ.1,53,999 లక్షలు(ఎక్స్ షోరూం). బైక్ రిజిస్ట్రేషన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను పొందవచ్చు. మేటర్ 5kWh, 6kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తోంది. స్పోర్టీ లుక్స్, అత్యాధునిక సాంకేతికతో వస్తున్న ఈ బైక్స్ యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి.
యూత్‌కి కనెక్ట్ అయ్యేలా..
మ్యాటర్ ఈవీ బైక్ యూత్‌ఫుల్, ప్రాక్టికల్ డిజైన్‌తో చూడగానే ఆకర్షించేలా ఉంది. ఎల్‌ఈడీ హెడ్‌లైట్, క్లిప్ ఆన్ హ్యాండిల్‌బార్స్, స్ప్లిట్ సీట్ సెటప్ వంటివి ఉన్నాయి. ఒకసారి చార్జ్ చేస్తే గరిష్టంగా 125 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. రెగ్యులర్ చార్జర్ సెటప్‌తో ఏరా 5000 బైక్ బ్యాటరీ 5 గంటల్లోనూ పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ చార్జర్‌తో అయితే రెండు గంటల్లోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది. మోటర్ సెటప్ కోసం 4 స్పీడ్ మాన్యుయల్ గేర్ షిఫ్ట్ లివర్ ఉంది. బ్యాటరీ ప్యాక్ పై కంపెనీ మూడేళ్ల వారంటీని అందిస్తోంది.
ఫీచర్లు ఇలా..
ఏరా 5000 వేరియంట్ ఆప్షనల్ 7 అంగుళాల ఎల్సీడీ టచ్ స్క్రీన్ ఇన్ స్ట్రుమెంట్ కలిగి ఆప్షనల్ బ్లూటూత్ కనెక్టివిటి, పార్క్ అసిస్ట్, కీలెస్ ఆపరేషన్, ఓటీఏ అప్డేట్, ప్రొగ్రెసివ్ బ్లింకర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 5000 ప్లస్ వేరియంట్ లో లైఫ్ స్టైల్ , కేర్ ప్యాకేజీతో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ స్టాండర్డ్ గా లభిస్తుంది.
స్థిరమైన ఈవీ మొబిలిటీ కోసమే..
ఈ సందర్భంగా గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈవో మోహల్ లాల్‌భాయ్ మాట్లాడుతూ.. ఏరా తమ దృక్పథం మార్పును సూచిస్తుందన్నారు. ఈవీ రంగంలో అంచనాలను తలకిందులు చేసే మార్పులను రూపొందించేందుకు తాము ప్రయత్నించలేదని, దేశంలో ఈవీ స్థిరమైన మొబిలిటీ కోసం, విస్తృత వినయోగం మార్గాలను రూపొందించినట్టు తెలిపారు. అత్యంత అధునాతన మోటార్‌బైక్ ‘ఏరా’ను అందరికీ అందుబాటులో తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







