Electric Scooter: గుజరాత్ మేడ్ ఈ-స్కూటర్ ఇదే, 100 కిలోమీటర్లకు మించిన రేంజ్.. అదిరే ఫీచర్లు..

గుజరాత్ కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు రన్ ఆర్ మొబిలిటీ సంస్థ తన కొత్త రన్ ఆర్ హెచ్ ఎస్, రన్ ఆర్ హెచ్ఎస్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేసింది.

Electric Scooter: గుజరాత్ మేడ్ ఈ-స్కూటర్ ఇదే, 100 కిలోమీటర్లకు మించిన రేంజ్.. అదిరే ఫీచర్లు..
Runr Hs
Follow us
Madhu

|

Updated on: Mar 03, 2023 | 4:30 PM

విద్యుత్ శ్రేణి వాహన తయారీలో పోటీ వాతావరణం ఉంది. దీంతో మార్కెట్లోకి విస్తృతంగా కంపెనీలు వివిధ మోడళ్లను విడుదల చేస్తున్నాయి. రోజుకో కొత్త వెర్షన్ మార్కెట్లో దర్శనమిస్తోంది. ఇదే క్రమంలో గుజరాత్ కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు రన్ ఆర్ మొబిలిటీ సంస్థ తన కొత్త రన్ ఆర్ హెచ్ ఎస్, రన్ ఆర్ హెచ్ఎస్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేసింది. భారతీయ వినియోగదారులకు ఇది బాగా ఉపకరిస్తుందని వివరించింది. దీనిలో మార్చుకోదగని బ్యాటరీలు ఉండనున్నాయి. ఇది గుజరాత్ లోని 4.2 ఎకరాల్లో విస్తరించి ఉన్న కంపెనీ ప్లాంట్ లో రోజుకు 500 వాహనా చొప్పున తయారు చేసేలా ప్రణాళిక చేసింది. ఈ కంపెనీలోనే ఇన్ హౌస్, మోటార్ టెస్టింగ్ ఉంది. దీనికి సంబంధించిన ఫీచర్లు, ధర ఇతర వివరాలు ఇప్పుడు చూద్దాం..

100, 140 కిలోమీటర్ల మైలేజీ..

త్వరలో మార్కెట్లోకి రానున్న రన్ ఆర్ హెచ్ఎస్, హెచ్ఎస్ ప్లస్ మోడళ్లు సరమైన ధరలోనే లభించనుంది. దీనిలోని మార్చుకోదగిన బ్యాటరీలు ఒక్కసారి చార్జ్ చేస్తే వరుసగా 100 కిలోమీటర్లు, 140 కిలోమీటర్ల పరిధిని అందిస్తాయి. ఈ బైక్ ని మార్చి మొదటి లేదా రెండో వారంలో మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

అత్యాధునిక ఫీచర్లు..

ఆధునిక డిజైన్ తో వస్తున్న ఈ స్కూటర్ యాంటీ థెఫ్ట్ అలారం, డివైజ్ లొకేటర్ వంటి అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది. అల్లాయ్ వీల్స్ , ఎల్ఈడీ టెయిల్ లైట్లను కలిగి ఉంది. అలాగే హై కాంట్రాస్ట్ ఎల్సీడీ డిస్ ప్లే మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..