AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boat Neck Band: బోట్ కంపెనీ నుంచి కొత్త నెక్ బ్యాండ్.. 10 నిమిషాల చార్జ్ చేస్తే పది గంటలు పని చేసేలా..!

బోట్ ఆడియో కొత్త నెక్ బ్యాండ్‌ను ఇటీవల మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. తన రాకర్జ్ మోడల్ కొత్త మోడల్‌గా వస్తున్న ఈ నెక్ బ్యాండ్ రాకర్జ్ 255 మ్యాక్స్ పేరుతో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. హైటెక్ ఫీచర్లతో వస్తున్న ఈ నెక్ బ్యాండ్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 60 గంటల నాన్ స్టాప్‌గా ప్లే అవుతుంది.

Boat Neck Band: బోట్ కంపెనీ నుంచి కొత్త నెక్ బ్యాండ్.. 10 నిమిషాల చార్జ్ చేస్తే పది గంటలు పని చేసేలా..!
Boat Rockerz 255 Neckband
Nikhil
|

Updated on: Mar 03, 2023 | 3:30 PM

Share

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్ వాడకాన్ని బాగా ఇష్టపడుతున్నారు. అంతే స్మార్ట్ ఫోన్ రిలేటెడ్‌గా ఎలాంటి ప్రొడెక్ట్స్ ఉన్న వాటిపై ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు పాటలు వినడానికి, వీడియోలు చూడడానికి, కాల్స్ మాట్లాడుకోడానికి ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది పడకుండా బ్లూటూత్ హెడ్ ఫోన్స్ వాడుతున్నారు. మొదట్లో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ కల్చర్.. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ డివైస్‌లు అందుబాటులో ఉండడంతో ప్రతి ఒక్కరూ వీటి వాడకంపై ఆసక్తి చూపుతున్నారు. వీటి వాడకం క్రమేపి పెరగడంతో కంపెనీలు కూడా కొత్త బ్లూటూత్ హెడ్ ఫోన్స్‌ను మార్కెట్‌లోకి ఇబ్బడిముబ్బడిగా రిలీజ్ చేస్తున్నాయి. వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకున్న బోట్ ఆడియో కొత్త నెక్ బ్యాండ్‌ను ఇటీవల మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. తన రాకర్జ్ మోడల్ కొత్త మోడల్‌గా వస్తున్న ఈ నెక్ బ్యాండ్ రాకర్జ్ 255 మ్యాక్స్ పేరుతో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. హైటెక్ ఫీచర్లతో వస్తున్న ఈ నెక్ బ్యాండ్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 60 గంటల నాన్ స్టాప్‌గా ప్లే అవుతుంది. అలాగే ముఖ్యంగా దీన్ని 10 నిమిషాలు చార్జ్ చేస్తే పది గంటల పాటు నిర్విరామంగా పని చేస్తుంది. 

ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ రిలీజ్ చేసిన ఈ నెక్ బ్యాండ్ ఇతర కంపెనీల నెక్ బ్యాండ్స్‌కు గట్టి పోటీనిస్తుందని చెప్పవచ్చు.  సొగసైన ఫినిషింగ్‌తో ఆకర్షనీయమైన రంగుల్లో ఇది యువతకు అందుబాటులో ఉంటుంది. మావెరెక్ మెరూన్, ఫేస్ బ్లూ, స్టన్నింగ్ బ్లాక్ రంగుల్లో ఈ నెక్ బ్యాండ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఐపీఎక్స్ 5 ఫ్రేమ్‌తో, మృధువైన సిలికాన్, అలాగే చిక్కుల్లేని కేబుల్, ఏబీఎస్ ప్లాస్టిక్‌తో ఈ నెక్ బ్యాండ్ వస్తుంది. బ్లూ టూత్ వి 5.3 చిప్ సెట్‌తో పని చేసే ఈ నెక్ బ్యాండ్ డ్యుయల్ డివైస్ కనెక్టవిటీతో వస్తుంది. ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్ ఆకట్టుకునే విధంగా  విధంగా వివిధ ఆప్షన్లు ఈ నెక్ బ్యాండ్‌లో ఉన్నాయి. 10 ఎంఎం డైనమిక్ డ్రైవర్లతో పాటు ఈక్యూ మోడ్స్ ఈ నెక్ బ్యాండ్ ప్రత్యేకత. నాయిస్ రెసిస్టెంట్‌తో పాటు వన్ టచ్ డయాగ్నస్టిక్స్‌తో ఆకట్టుకునేలా దీన్ని డిజైన్ చేశారు. అలాగే బోట్ హియరబుల్ యాప్ సపోర్ట్‌తో ఈ నెక్ బ్యాండ్‌ను ఉపయోగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..