Systematic Investment Plan: మిమ్మల్ని మిలియనీర్‌‌ని చేసే స్కీమ్ ఇది.. కేవలం రూ. 15,000తో రూ.10 కోట్లు సంపాదించే అవకాశం..

తక్కువ పెట్టబడితో అధిక రాబడిని ఇచ్చే పెట్టుబడి పథకాలలో బస్ట్ ఆప్షన్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP). కొన్నేళ్లుగా ఎస్ఐపీ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది.

Systematic Investment Plan: మిమ్మల్ని మిలియనీర్‌‌ని చేసే స్కీమ్ ఇది.. కేవలం రూ. 15,000తో రూ.10 కోట్లు సంపాదించే అవకాశం..
Systematic Investment Scheme
Follow us

|

Updated on: Feb 28, 2023 | 2:20 PM

మ్యూచువల్ ఫండ్స్.. సాధారణంగా కాస్త రిస్క్ తో కూడుకున్నవి. అయితే వీటిల్లో కూడా దీర్ఘకాలంలో తప్పనిసరిగా అధిక రాబడినిచ్చే పథకాలు ఉన్నాయి. వాటిల్లో తక్కువ పెట్టబడితో అధిక రాబడిని ఇచ్చే పెట్టుబడి పథకాలలో బస్ట్ ఆప్షన్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP). కొన్నేళ్లుగా దీనికి అధిక ప్రజాదరణ లభిస్తోంది. ఎస్ఐపీ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం తక్కువ పెట్టుబడితో దీన్ని ప్రారంభించేందుకు అవకాశం ఉండటం. ఒక వేళ మీరు కనుక ఏదైనా స్కీమ్ లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ ఎస్ఐపీ మీకు బెస్ట్ ఆప్షన్. రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకొనే వారి కూడా ఇదే మంచి పథకం. అయితే దీని ప్రయోజనాలు పొందాలంటే ఉద్యోగ ప్రారంభ దశలోనే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ముఖ్యం. దీనివల్ల పెద్ద మొత్తంలో మీరు సంపాదించగలుతారు. ముఖ్యంగా పదవీవిరమణ సమయానికి మీరు రిటర్న్ వచ్చేలా మెచ్యూరిటీ పెట్టుకుంటే భారీ మొత్తంలో మీకు ప్రయోజనం సమకూరే అవకాశం ఉంది. ఈ క్రమంలో అసలు ఎస్ఐపీ అనే పథకం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం..

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అంటే..

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) అనేది పెట్టుబడిదారులకు అనేక మ్యూచువల్ ఫండ్‌లు అందించే పెట్టుబడి పథకం. ఇది సాధారణ, తక్కువ లేదా పెద్ద పెట్టుబడులను చేయడానికి వీలు కల్పిస్తుంది. దీనిలో పెట్టుబడులు వారానికో, నెలవారీ లేదా త్రైమాసిక ప్రాతిపదికన చేయవచ్చు. ముందుగా నిర్ణయించిన వ్యవధిలో స్థిర పెట్టుబడులు ఇందులో జమ చేయవచ్చు. దీనితో, పెట్టుబడిదారుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది.

ఎలా పని చేస్తుంది?

ఈ ఉదాహరణ ద్వారా ఎంత పెట్టుబడికి ఎంత రాబడి వస్తుందో చూద్దాం.. మీరు పది కోట్ల రూపాయలను రిటైర్ మెంట్ సమయంలో పొందాలనుకుంటే.. అంటే 60 ఏళ్ల వయసులో ఇది మీకు రావాలంటే మీరు 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు దీనిలో పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టాలి. ప్రతి రూ. 8416 చొప్పున నెలనెలా పెట్టుబడి పెడితే కనీసం 12శాతం వడ్డీని ఊహించినా మీకు రూ. 10 కోట్లు ఆదాయం సమకూరుతుంది. ఒక వేళ మీరు 25 ఏళ్ల వయస్సులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, 60 ఏళ్లు వచ్చేసరికి పది కోట్లు సంపాందించాలంటే నెలకు రూ.15,396ను పెట్టుబడి పెట్టాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.