National Pension System: రూ. 5000 పెట్టుబడితో.. రూ. కోటి సంపాదించే స్కీమ్ ఇదే.. ఇప్పుడే ప్రారంభించండి..
ద్రవ్యోల్బణాన్ని అధిగమించడంలో సహాయపడే అనేక పరిష్కారాలు మన వద్ద అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మీరు స్వల్ప పెట్టుబడులు పట్టడం ద్వారా కొన్నేళ్లలోనే మీరు మిలీనియర్ గా మారవచ్చు.
రోజురోజుకూ పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి ప్రధానకారణం దేశంలో ద్రవ్యోల్బణం పెరగడం. దీంతో సగటు మనిషి బతకడం చాలా కష్టమవుతోంది. చాలా మంది ప్రజలు తమ ఇంటి బడ్జెట్‌ను నిర్వహించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సవాళ్లతో కూడిన సమయాల్లో భవిష్యత్తు గురించి, ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత జీవితం గురించి ఆందోళన చెందడం సహజం. అయితే అదృష్టవశాత్తూ ద్రవ్యోల్బణాన్ని అధిగమించడంలో సహాయపడే అనేక పరిష్కారాలు మన వద్ద అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో వీరు స్వల్ప పెట్టుబడులు పట్టడం ద్వారా కొన్నేళ్లలోనే మీరు మిలీనియర్ గా మారవచ్చు. వాటిల్లో బెస్ట్ పథకం నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్). దీనిని కేంద్ర ప్రభుత్వం 2004 జనవరి ఒకటిన ప్రారంభించింది. ఇది పదవీవిరమణ పథకం. ఇది మొదట్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాత్రమే అని చెప్పినా తర్వాత కాలంలో ప్రైవేటు రంగంలో పనిచేసే వారు కూడా వినియోగించుకొనే వెసులుబాటును కల్పించింది. దీనిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు పన్ను మినహాయింపులు పొందవచ్చు. అలాగే మీ పదవీవిరమణ వయసుకొచ్చేసరికి పెద్ద మొత్తంలో మీరు స్థిర ఆదాయాన్ని పొందగలుగుతారు. ఈ నేపథ్యంలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
అర్హతలు ఇవి..
ఎన్పీఎస్ లో చేరడానికి 18 ఏళ్లు నిండిన భారతపౌరులు ఎవరైనా అర్హులే. కనీసం రూ. 500 టైర్ లేదా టైర్ 2 ఖాతాను ప్రారంభించవచ్చు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం పదవీవిరమణ తర్వాత జీవితానికి భద్రత ఇవ్వడమే. దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ మొత్తాన్ని రాబట్టవచ్చు.
ఎంత మొత్తం వస్తుంది..
మీకు ఇప్పుడు 30 ఏళ్లు అయితే 60 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేస్తారు. మీరు ఇప్పటి నుంచే ప్రతి నెలా రూ. 5,000 చొప్పున ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారనుకోండి. మీరు పదవీ విరమణ చేసే సమయానికి రూ. ఒక కోటి కంటే ఎక్కువ మొత్తాన్నిమీరు సేకరించవచ్చు. పెట్టిన పెట్టుబడిపై కనీసం రాబడి 10 శాతం అంచనా వేసినా నికర పెన్షన్ సంపద ొత్తం రూ. 1.11 కోట్లు ఉంటుంది. అంటే మీరు 60 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి మీరు నెలకు రూ. 27,996 పెన్షన్‌ను పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..