Nexon SUV: మార్కెట్‌లోకి సైలెంట్‌గా నయా నెక్సాన్ ఎస్‌యూవీ రిలీజ్.. ఆకట్టుకునే డిజైన్‌తో అదిరిపోయే ఫీచర్లు..
టాటా మోటార్స్ 2023 నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ పేరుతో ఓ కొత్త ఎస్‌యూవీను మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఈ కారు సిల్హౌట్‌ను కలిగి ఉన్నప్పటికీ సరికొత్త డిజైన్‌తో వస్తుంది. అలాగే ఈ కారులో అధునాతన ఫీచర్లు మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ దేశంలోనే అత్యంత ఎక్కువ ఫీచర్లతో వచ్చే సబ్ 4 ఎం ఎస్‌యూవీ అని మార్కెట్ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి.

సాధారణంగా ఓ కొత్త కారు మార్కెట్‌లోకి రిలీజ్ అవుతుందంటే కారు రిలీజయ్యే కొన్ని రోజుల నుంచి కంపెనీ టీజర్లతో రచ్చ చేస్తుంది. అయితే టీజర్‌లతో ఎలాంటి హైప్‌ను సృష్టించకుండా టాటా మోటార్స్ 2023 నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ పేరుతో ఓ కొత్త ఎస్‌యూవీను మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఈ కారు సిల్హౌట్‌ను కలిగి ఉన్నప్పటికీ సరికొత్త డిజైన్‌తో వస్తుంది. అలాగే ఈ కారులో అధునాతన ఫీచర్లు మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ దేశంలోనే అత్యంత ఎక్కువ ఫీచర్లతో వచ్చే సబ్ 4 ఎం ఎస్‌యూవీ అని మార్కెట్ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. కాబట్టి ఈ కారు డిజైన్‌తో పాటు ఇతర ఫీచర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.
నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్
నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ డిజైన్ విషయానికి వస్తే ముందు భాగంలో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారు మరింత స్పోర్టీగా కనిపించే బంపర్‌పై ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు తక్కువగా ఉన్నాయి. 16-అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ కారుకు ఓ ప్రత్యేక లుక్‌ను ఇస్తున్నాయి. అలాగే వెనుక వైపున పూర్తి వెడల్పుగా ఉండే టెయిల్ లైట్ ఆకట్టుకుంటుంది. ఈ లైట్‌ను ఎక్స్ ఫాక్టర్ టెయిల్ ల్యాంప్‌గా పిలుస్తారని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా నెక్సాన్ గత మోడల్స్‌కు భినంగా క్యాబిన్‌లోపల సరికొత్త మార్పులు చేసింది. టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ కొత్త టూ-స్పోక్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ కంపెనీలోగోతో వస్తుంది. ముఖ్యంగా హెచ్‌వీఏసీ యూనిట్ ఇప్పుడు టచ్ ప్యానెల్‌గా మారింది. అయితే సెంటర్ కన్సోల్ కూడా కొత్త గేర్ సెలెక్టర్‌తో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ కొత్త 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు అదే పరిమాణంలో ఉన్న పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది.
నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు
టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌లో టాటా కంపెనీకి సంబంధించి ప్రత్యేకమైన ఐఆర్‌ఏ 2.0తో వస్తుంది. అలాగే వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, జేబీఎల్ నైన్-స్పీకర్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఈ కారు ప్రత్యేకతలు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌పై మొదటి-ఇన్-సెగ్మెంట్ నావిగేషన్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఫస్ట్-ఇన్-క్లాస్ బ్లైండ్-వ్యూ మానిటర్, ఈఎస్‌పీ,ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్-హోల్డ్ కంట్రోల్, రోల్ ఓవర్ మిటిగేషన్, ట్రాక్షన్ కంట్రోల్,ఐఎస్‌ఓఎఫ్‌ఐఎక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు ఉన్నాయి. ఈ కారుల 1.2-లీటర్ మూడు-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 118హెచ్‌పీ పవర్, 1.5-లీటర్ నాలుగు-సిలిండర్ డీజిల్ మోటారు 113 హెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజన్ ఇప్పుడు వేరియంట్‌ను బట్టి 5 స్పీడ్ ఎంటీ, 6-స్పీడ్ ఎంటీ, 6 స్పీడ్ ఏఎంటీ, కొత్త 7-స్పీడ్ డీసీటీ అనే నాలుగు విభిన్న ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో వస్తుంది. డీజిల్ ఇంజన్ మాత్రం 6ఎంటీ, 6 ఏంఎటీతో కొనసాగుతుంది. అయితే టాటా నెక్సన్ ఫేస్‌లిఫ్ట్ ధర ఇంకా వెల్లడి కాలేదు. ఈ కారు క్రియేటివ్, ఫియర్‌లెస్, ప్యూర్, స్మార్ట్ అనే నాలుగు విభిన్న ట్రిమ్ స్థాయిలలో అందిస్తోంది. వీటిని మొత్తం 11 వేరియంట్‌లుగా విభజించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి