- Telugu News Photo Gallery Business photos Tata Nexon SUV new variants introduced at starting price Rs 11,58,900
Tata Nexon: టాటా నెక్సాన్ నుంచి మూడు వేరియంట్లలో కార్లు విడుదల.. ఫీచర్స్, ధర, ఇతర పూర్తి వివరాలు
Tata Nexon: టాటా మోటార్స్ సోమవారం నెక్సాన్ కాంపాక్ట్ SUV కొత్త వేరియంట్‌లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయ వాహన తయారీ సంస్థ SUV యొక్క XZ+(P), XZA+(P), XZ+(HS), XZA+(HS) ..
Updated on: Mar 01, 2022 | 1:50 PM

Tata Nexon: టాటా మోటార్స్ సోమవారం నెక్సాన్ కాంపాక్ట్ SUV కొత్త వేరియంట్‌లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయ వాహన తయారీ సంస్థ SUV, XZ+(P), XZA+(P), XZ+(HS), XZA+(HS) వేరియంట్‌లను పరిచయం చేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన వేరియంట్లకు సంబంధించి ధరలను కూడా వెల్లడించింది.

బుకింగ్ కూడా ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. టాటా నెక్సాన్ కొత్త వేరియంట్‌లు అన్ని అధీకృత టాటా మోటార్స్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్‌లను ప్రారంభించడమే కాకుండా టాటా మోటార్స్ తన రంజన్‌గావ్ ప్లాంట్ నుండి టాటా నెక్సాన్ యూనిట్‌లను కూడా విడుదల చేసింది.

Nexon XZ+ (P) ధర రూ. 11,58,900 కాగా, XZA+ (P) ధర రూ. 12,23,900, Nexon XZ+ (HS) ధర రూ. 10,86,800, XZA+ (HS) ధర రూ. 11,51,800 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ కొత్త వేరియంట్‌లు పెట్రోల్, డీజిల్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటాయని టాటా మోటార్స్ తెలిపింది. అలాగే ఇవి కొత్త రాయల్ బ్లూ ఎక్స్టీరియర్ పెయింట్ థీమ్‌లో అందుబాటులో ఉంటాయి.

టాటా నెక్సాన్ కొత్త వెర్షన్లు ప్రస్తుత మోడల్ మాదిరిగానే అదే డిజైన్‌తో వస్తాయి. డిజైన్ పరంగా ఎలాంటి మార్పు లేదు. అయితే Nexon XZ+ (P), XZA+ (P) వంటి కొత్త వేరియంట్‌లు బెనెక్యూ కాలికో లెథెరెట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటో-డిమ్మింగ్ IRVM వంటి అదనపు ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి.

మరోవైపు కొత్త XZ+ (HS), XZA+ (HS) వేరియంట్‌లు ఎయిర్ ప్యూరిఫైయర్‌లతో వస్తాయి. ఈ అదనపు ఫీచర్లు ఈ కొత్త Nexon వేరియంట్‌ల సంబంధిత Dark ఎడిషన్‌లలో కూడా అందుబాటులో ఉంటాయి.



















