- Telugu News Photo Gallery Business photos Hero Eddy short commute electric scooter unveiled. And no, license not needed
Hero Eddy: హీరో నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం.. లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు
Hero Eddy: మార్కెట్లో కొత్త కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్తున్నాయి..
Updated on: Mar 02, 2022 | 8:40 AM

Hero Eddy: మార్కెట్లో కొత్త కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్తున్నాయి. ఇక కస్టమర్లు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.

హీరో ఎలక్ట్రిక్ మంగళవారం సరికొత్త టూవీలర్ మోడల్‌ను ఆవిష్కరించింది. దేశీయ మార్కెట్ కోసం హీరో ఎడ్డీని పరిచయం చేసింది. ఈ స్కూటర్ ధర రూ.72,000 (ఎక్స్ షోరూమ్). ఇందులో అనేక ఫీచర్స్‌ను జోడించింది.

ఈ వాహనం ఎల్లో, లైట్ బ్లూ రంగుల్లో అందుబాటులోకి తీసుకురానుంది. హీరో ఎలక్ట్రిక్ తన లూథియానా అధారిత తయారీ ప్లాంట్ నుంచి ఉత్పత్తులను విడుదల చేసింది.

ఫైండ్ మై బైక్, లార్జ్ బూట్ స్పేస్, ఫాల్లో మీ హెడ్‌ల్యాంప్స్, రివర్స్ మోడ్ వంటి ఫీచర్స్ ఈ వాహనం ప్రత్యేకత. ఇక ఈ వాహనానికి ఎలాంటి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు.





























