Samsung: శాంసంగ్ నుంచి 200 మెగా పిక్సెల్ కెమెరాతో కొత్త స్మార్ట్‌ఫోన్!
Galaxy S24 Ultrలో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. Galaxy S24 Ultra కెమెరా ఫీచర్స్ వెల్లడించింది. టిప్‌స్టర్ ప్రకారం.. Samsung 2024 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 200-మెగాపిక్సెల్ శాంసంగ్ ISOCELL HP2SX సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇమేజ్ సెన్సార్ Galaxy S23 Ultra యొక్క ISOCELL HP2 సెన్సార్ ఆప్టిమైజ్ చేసిన వెర్షన్. ఇది 1/1.3 ఆప్టికల్ ఫార్మాట్‌లో 200 మిలియన్ పిక్సెల్‌లను కలిగి ఉంది..
ప్రపంచ మార్కెట్‌లో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇది తన S సిరీస్ ఫోన్‌లను పెద్ద ఎత్తున ఆవిష్కరించనుంది. Samsung Galaxy S23 సిరీస్‌ను ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసింది. ఈ ఫోన్ ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. S సిరీస్ కింద సంవత్సరానికి ఒక మొబైల్‌ను విడుదల చేసే Samsung.. ఇప్పుడు S24 సిరీస్ (Samsung Galaxy S24 సిరీస్)ని వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయనుంది. ఇప్పుడు ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా 200 మెగా పిక్సెల్ కెమెరా ఉండనుందని సమాచారం.
ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించబడిన టాప్-ఎండ్ గెలాక్సీ S23 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ కెమెరా కూడా అద్భుతమైనది. ఇది 200-మెగాపిక్సెల్ Samsung ISOCELL HP2 సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది మునుపటి Galaxy S22 Ultraలో 108-మెగాపిక్సెల్ సెన్సార్ నుంచి అప్‌గ్రేడ్ చేయబడింది. ఇప్పుడు కెమెరా మెరుగుదలలతో వచ్చే ఏడాది Galaxy S24 Ultra లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
Galaxy S24 Ultrలో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. Galaxy S24 Ultra కెమెరా ఫీచర్స్ వెల్లడించింది. టిప్‌స్టర్ ప్రకారం.. Samsung 2024 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 200-మెగాపిక్సెల్ శాంసంగ్ ISOCELL HP2SX సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇమేజ్ సెన్సార్ Galaxy S23 Ultra యొక్క ISOCELL HP2 సెన్సార్ ఆప్టిమైజ్ చేసిన వెర్షన్. ఇది 1/1.3 ఆప్టికల్ ఫార్మాట్‌లో 200 మిలియన్ పిక్సెల్‌లను కలిగి ఉంది. అలాగే 0.6-మైక్రాన్ పిక్సెల్‌లను కలిగి ఉన్నట్లు తెలిపింది.
200-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు, గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ కొత్త టెలిఫోటో లెన్స్‌ను కూడా అందిస్తుంది. ఇది 3x ఆప్టికల్ జూమ్‌తో 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాను ప్యాక్ చేస్తుందని లీక్‌ల ద్వారా తెలుస్తోంది. Galaxy S24 Ultraలో స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. కానీ Galaxy S24, Galaxy S24+ ఎక్సినోస్ 2400 SoCతో లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. అల్ట్రా మోడల్ 12GB RAM + 256GB, 8GB RAM + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది.
శాంసంగ్ గెలక్సీ ఎస్ 24 సిరీస్‌లో టైటానియం ఫ్రేమ్‌లు ఉపయోగించబడుతున్నాయి. ఇందులో అల్యూమినియం ఛాసిస్ ఉంది. ఇంకా, గెలక్సీ ఎస్24 ఆల్ట్రా దీర్ఘకాలిక, శక్తివంతమైన బ్యాటరీ జీవితాన్ని అందించడానికి కొత్త ఈవీ బ్యాటరీ సాంకేతికతతో వస్తుందని కూడా సమాచారం. అయితే శాంసంగ్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుంది. ఇందులో భాగంగా కొత్త కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి