Gold Investment: మధ్యతరగతి ప్రజలు బంగారంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా?
బంగారంలో ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చాయి. డిజిటల్ గోల్డ్ అందులో బాగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ బంగారం భౌతికంగా మన దగ్గర ఉండదు. సులభమైన భాషలో చెప్పాలంటే.. మనం బంగారం కొనుక్కుంటే మన పేరుపై డిజిటల్ లాకర్ లో బంగారం ఉంటుంది. అవసరం అనుకుంటే.. దానిని భౌతిక బంగారంగా మార్చుకోవచ్చు. లేదంటే.. అలానే ఉంచి తిరిగి ఇచ్చేస్తే అప్పటి ధర ప్రకారం..
బంగారం.. మన దేశంలో ప్రతి ఒక్కరికీ ఎంతో ఆసక్తిని కలిగించే మాట. బంగారం పేరు ఎత్తితే చాలు అందరి కళ్ళలో వెలుగు కనిపిస్తుంది. ఆభరణాలుగా మన దేశంలో బంగారానికి ఏంతో డిమాండ్. ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ ముందువరుసలో ఉంటుంది. మతపరమైన పండుగ అయినా, శుభ సందర్భమైనా, కుటుంబంలో వివాహం అయినా లేదా పిల్లల వివాహానికి ప్రణాళిక అయినా, బంగారం ఎక్కువగా కోరుకునే వస్తువు. బంగారం ఇలా అలంకరణ కోసం మాత్రమె కాదు మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కూడా. మనదేశంలో ప్రజలు తమకు తెలియకుండానే బంగారం కొని దాచుకుంటూ ఆ రూపంలో తమ సేవింగ్స్ ఉంచుకోవడం జరుగుతూ వస్తోంది. ప్రత్యేకంగా బంగారం పై ఇన్వెస్ట్మెంట్ అనేది మన దేశంలో చాలా తక్కువ. అయితే, ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు మన ప్రజలు చూస్తున్నారు. బంగారంపై ఇన్వెస్ట్ చేయడాన్ని ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. భౌతికంగా బంగారం కొనడం కంటే గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టడం వైపు ప్రజల్ని చైతన్యం చేస్తూ వస్తోంది. దానికోసం సావరిన్ గోల్డ్ బాండ్స్ తీసుకువచ్చింది. ఇది ఇలా ఉంటె.. అసలు బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా? మధ్యతరగతి ప్రజలు బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా ఎంచుకోవచ్చా? పరిశీలిద్దాం.
బంగారంలో ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చాయి. డిజిటల్ గోల్డ్ అందులో బాగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ బంగారం భౌతికంగా మన దగ్గర ఉండదు. సులభమైన భాషలో చెప్పాలంటే.. మనం బంగారం కొనుక్కుంటే మన పేరుపై డిజిటల్ లాకర్ లో బంగారం ఉంటుంది. అవసరం అనుకుంటే.. దానిని భౌతిక బంగారంగా మార్చుకోవచ్చు. లేదంటే.. అలానే ఉంచి తిరిగి ఇచ్చేస్తే అప్పటి ధర ప్రకారం మన డబ్బు మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు వంద రూపాయలు కూడా డిజిటల్ గోల్డ్ పై ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని చాలా కంపెనీలు తీసుకువచ్చాయి. పేమెంట్ యాప్స్ కూడా ఈ ఆప్షన్ అందిస్తున్నాయి.
బంగారం మంచి పెట్టుబడి ఎంపికనా? అనేది ఇప్పుడు ప్రశ్న. ఒక వస్తువు లేదా ప్రోడక్ట్ ఇన్వెస్ట్మెంట్ మంచిదా కాదా అనేది అంచనా వేయడానికి దాని రాబడిని మాత్రమే పరిశీలించాలి. ఉదాహరణకు, కొంత కాలం క్రితం వరకు ఎఫ్‌డీలు, ముఖ్యంగా పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలు మధ్యతరగతి పెట్టుబడి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఎఫ్‌డీ రాబడి 7% చుట్టూ ఉండటంతో, ఈ ప్రోడక్ట్ దాని వెలుగు కోల్పోయింది. ఇప్పటికీ సురక్షితమైన పెట్టుబడి మార్గంగా ఎఫ్‌డీని పరిగణిస్తున్నారు. అలాగే మధ్యతరగతి పెట్టుబడిదారులు ఎక్కువ ఇంట్రస్ట్ చూపించే ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF). దీనిలోనూ పరిమిత రాబడులు ఉంటాయి. కానీ మన డబ్బుకు గ్యారెంటీ ఉంటుంది. ఇక మూడో ఆప్షన్ బంగారం. మధ్యతరగతి ప్రజలు బంగారాన్ని పెట్టుబడి కోణంలో చూడకపోయినా.. ఆభారాణాలుగా కొని అవసరం కోసం దాచుకోవడం సాధారణంగా జరుగుతుంది. అయితే, పెట్టుబడి కోణంలో దీర్ఘకాలానికి చూస్తే గోల్డ్ మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
బంగారం పై పెట్టుబడి ఎప్పుడూ షార్ట్ టర్మ్ కోసం మంచిది కాదు. గోల్డ్ రేట్లు ఎప్పుడు పెరగొచ్చు.. తాగొచ్చు. అందువల్ల ఈరోజు కొని రెండురోజుల్లో అమ్మేసుకుందామని అనుకుంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంత మంచి ఆప్షన్ కాదు. ఒకవేళ చాలా కాలం పాటు మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటేనే బంగారం మంచి పెట్టుబడి సాధనంగా చెప్పవచ్చు. దీర్ఘకాలంలో బంగారంపై ఇన్వెస్ట్మెంట్ సురక్షితంగా కనీసం 8 శాతం రాబడి ఇస్తుందని నిపుణుల లెక్కలు చెబుతున్నాయి. దీర్ఘకాలానికి అంటే పదేళ్ళ పాటు ఇన్వెస్ట్ చేస్తే బంగారంపై 14 శాతానికి పైగా రాబడి రావచ్చనేది ఒక అంచనా.
బంగారంపై ఎంత ఇన్వెస్ట్ చేయాలి?
బంగారంపై రిటర్న్స్ బావుంటాయి అని ఇన్వెస్ట్మెంట్ మొత్తం బంగారంపై చేయడం అంత వివేకమైన చర్య కాదు. పెట్టుబడులు ఎప్పుడూ వైవిధ్యభరితంగా ఉండాలి. మధ్యతరగతి వారైనా.. డబ్బు ఉన్నవారైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వివిధ రకాల సాధనాల్లో పెట్టుబడి పెట్టడం మంచి పధ్ధతి అని నిపుణులు సూచిస్తున్నారు. మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలో ఒక భాగంగా మాత్రమే బంగారం ఉండాలి. సాధారణంగా పోర్ట్‌ఫోలియోలో 5%-10% మాత్రమే బంగారానికి కేటాయించాలి అని నిపుణులు సూచిస్తున్నారు.
బంగారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. దీర్ఘకాలానికి మదుపు చేయవలని, షార్ట్‌టర్మ్ కోసం కాదు. బంగారం ఒక చక్రీయ పెట్టుబడి, లోహం ఎల్లప్పుడూ అధిక పనితీరును కనబరుస్తుందని ఆశించడం సరైనది కాదు. అందుకే మీరు తక్షణ ఫలితాల కోసం వెతకడం లేదు. దీర్ఘకాల పెట్టుబడిదారు అయితే, బంగారం పెట్టుబడి పెట్టే సాధనాల్లో ఒకటి.
బంగారంపై ఎంత పెట్టుబడి పెట్టాలి?
బంగారంలో పెట్టుబడి పెట్టడం గురించి ఖచ్చితంగా చెప్పాల్సిన ఒక విషయం ఏమిటంటే, అనిశ్చితి లేదా సంక్షోభ సమయంలో, అలాగే ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా మంచి రక్షణ కోసం మెటల్ మీకు సహాయం చేస్తుంది. అందువల్ల, దీనిని పెట్టుబడి సాధనాల్లో ఒకటిగా పరిగణించాలి. మీరు మధ్యతరగతికి చెందిన వారా? కాదా? అనే దానితో సంబంధం లేకుండా బంగారం మీ పోర్ట్‌ఫోలియోలో భాగం కావాలి. ఆదర్శ పెట్టుబడి పోర్ట్‌ఫోలియో మొత్తం పోర్ట్‌ఫోలియోలో 5%-10% మాత్రమే బంగారానికి కేటాయించాలి.
మొత్తమ్మీద చూసుకుంటే, బంగారం పై ఇన్వెస్ట్మెంట్ సురక్షితం. అదే సమయంలో తక్కువ కాలం కోసం బంగారంపై ఇన్వెస్ట్ చేయడం వలన ఉపయోగం ఉండదు. అలాగే, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడూ ఒకే సాధనంలో చేయడం వలన కూడా రిస్క్ ఎక్కువగానే ఉంటుందనేది అర్ధం చేసుకోవాలి.