Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నాయా? ఈ తప్పులు చేయకండి

ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నవారు రివార్డ్ పాయింట్స్ నుంచి లాభాన్ని పొందేలా ఖర్చు చేయవచ్చు. ఉదాహరణకు మీ దగ్గర ఎ, బి, సి అనే మూడు బ్యాంకుల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. మీరు ఆన్ లైన్ లో ఒక వస్తువు కొందామని అనుకుంటున్నారు. అప్పుడు ఆఫర్లను పరిశీలించండి. ఎ అనే బ్యాంక్ కార్డ్ కు తక్కువ రివార్డ్ పాయింట్లు ఉన్నాయి. సి బ్యాంక్ కార్డ్ పై ఎక్కువ..

Credit Card: ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నాయా? ఈ తప్పులు చేయకండి
Credit Card
Follow us
Subhash Goud

|

Updated on: Sep 02, 2023 | 6:27 PM

కరోనా తరువాత క్రెడిట్ కార్డుల జారీ.. వినియోగం రెండూ పెరిగాయని బ్యాంకుల లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఒక్కొక్కరి దగ్గర ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు కూడా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే క్రెడిట్ కార్డ్ బ్యాంక్ ఇచ్చే షార్ట్ టర్మ్ రుణంగా  చెప్పవచ్చు. కార్డును ఉపయోగించడంలో విచక్షణ లేకపోతే అప్పుల ఊబిలోకి జారిపోవడం ఖాయం. అయితే, క్రెడిట్ కార్డ్ ను జాగ్రత్తగా ఉపయోగిస్తే అవసరం కోసం ఉపయోగపడే స్నేహితుడిలా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇక బహుళ క్రెడిట్ కార్డులు ఉండటం వలన కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే, వాటిని జాగ్రత్తగా ఒక ప్లాన్డ్‌గా ఉపయోగించడం చేయాలి. మీ దగ్గర కూడా ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే ఈ తప్పులు అసలు చేయకండి. అవేమిటో చూద్దాం..

  1. క్రెడిట్ కార్డ్ వాడకంలో వడ్డీ రహిత కాలం: చాలా ముఖ్యమైన విషయం. కార్డ్ లావాదేవీల తేదీ.. బిల్లింగ్ సైకిల్ ప్రకారం దానిని చెల్లించే చివరి తేదీ మధ్య వ్యవధి వడ్డీ రహిత కాలంగా చెబుతారు. ఈ కాలంలో మీరు క్రెడిట్ కార్డ్ బిల్లు మొత్తాన్ని వాటి గడువు తేదీల్లోగా తిరిగి చెల్లించినంత కాలం, ATM నగదు ఉపసంహరణలపై మినహా, క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై ఎలాంటి వడ్డీ విధించరు. లావాదేవీ తేదీ ఆధారంగా ఈ వ్యవధి 18-55 రోజుల మధ్య ఉండవచ్చు. మీ దగ్గర ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లు ఉంటే మిగిలిన వడ్డీ రహిత వ్యవధి ఆధారంగా వివిధ కార్డ్‌ల ఖర్చులు పేమెంట్స్ రొటేట్ చేసుకోవడం ద్వారా లబ్ది పొందవచ్చు.
  2. రీపెమేంట్ కెపాసిటీకి మించి ఖర్చు చేయవద్దు: ఆకర్షణీయమైన క్రెడిట్ కార్డ్ ఆఫర్‌లు – డిస్కౌంట్‌లు తరచుగా క్రెడిట్ కార్డ్ వినియోగదారుల ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతీస్తాయి. ఈ క్రమంలో రీపేమెంట్ సామర్థ్యానికి మించి ఖర్చు చేయడం జరిగిపోతుంది. కానీ గడువు తేదీలోగా మొత్తం క్రెడిట్ కార్డ్ బిల్లును తిరిగి చెల్లించడంలో విఫలమైతే ఫైనాన్స్ ఛార్జీల రూపంలో సంవత్సరానికి 23-49 శాతం వడ్డీ భారం పడుతుంది. చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైతే అదనంగా నెలకు రూ.1,300 వరకు లేట్ పేమెంట్ చార్జీలు కూడా చెల్లించాల్సి వస్తుంది. మీ కార్డ్‌లను తెలివిగా ఉపయోగించుకోండి. గడువు తేదీలోగా మీరు బకాయిలను క్లియర్ చేయగలిగితే మాత్రమే ఖర్చు చేయండి.
  3. రివార్డ్ పాయింట్ల నుంచి లబ్ది పొందండి: ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నవారు రివార్డ్ పాయింట్స్ నుంచి లాభాన్ని పొందేలా ఖర్చు చేయవచ్చు. ఉదాహరణకు మీ దగ్గర ఎ, బి, సి అనే మూడు బ్యాంకుల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. మీరు ఆన్ లైన్ లో ఒక వస్తువు కొందామని అనుకుంటున్నారు. అప్పుడు ఆఫర్లను పరిశీలించండి. ఎ అనే బ్యాంక్ కార్డ్ కు తక్కువ రివార్డ్ పాయింట్లు ఉన్నాయి. సి బ్యాంక్ కార్డ్ పై ఎక్కువ రివార్డ్ పాయింట్లు ఉన్నాయి. అప్పుడు మీరు సి కార్డ్ నుంచి కొనుగోలు చేయండి. అదేసమయంలో ఈ కార్డుల మధ్య వడ్డీ రహిత కాలాన్ని కూడా దృష్టిలో ఉంచుకోండి.
  4. ఈఎంఐలు ఆఫర్లను పోల్చి చూసుకోండి: క్రెడిట్ కార్డులు ఉపయోగించే టప్పుడు ఆయా బ్యాంకులు ఇచ్చే ఆఫర్లను పోల్చి చూసుకోండి. ఏ బ్యాంక్ నుంచి ఎక్కువ ఆఫర్ వస్తోందో చెక్ చేసుకోండి. కొన్ని సార్లు ఆన్ లైన్ లోనూ ఆఫ్ లైన్ లోనూ కూడా కొన్ని బ్యాంకులు తమ కార్డుల నుంచి జరిపే పేమెంట్స్ పై డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తూ ఉంటాయి. వాటిని ఉపయోగించుకోవడం ద్వారా ఆదా చేసుకోండి.
  5. రిమైండర్ సెట్ చేసుకోండి: క్రెడిట్ కార్డ్ బిల్ గడువు దాటిపోతే విపరీతమైన పెనాల్టీలు విధిస్తారు. అందుకే, మీరు మీ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కోసం రిమైండర్ సెట్ చేసుకోండి. బిల్లు కట్టాల్సిన తేదీ లోగా కట్టేసేలా ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు అన్ని బ్యాంకులు తమ యాప్ ల ద్వారా రిమైండర్స్ పంపిస్తున్నాయి. వాటిని ఉపయోగించుకోండి.

ఏది ఏమైనా క్రెడిట్ కార్డ్ అనేది జాగ్రత్తగా ఉపయోగిస్తే ఎంత చక్కగా మనకి సహాయపడుతుందో.. మీరు బిల్లు చెల్లించడంలో విఫలమైతే తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని క్రెడిట్ కార్డ్ తో చేసే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి