Hyderabad: విద్యాసంస్థల పేరుతో రూ.35 కోట్లు మోసం.. దంపతులు అరెస్ట్
విద్యాసంస్థలో భాగస్వామ్యం అంటూ ఏలూరుకు చెందిన దంపతులు చాలా మందిని మోసం చేసినట్టు విచారణలో తేలింది. NRIని మోసగించిన కేసులో భార్యాభర్తల్ని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హిమాయత్‌నగర్‌లో ఐటీ కంపెనీ నిర్వహిస్తున్న శ్రీనివాస్, అమెరికాలోని తన స్నేహితుడు సుధాకర్ సూచనతో శ్రీహర్షిత విద్యాసంస్థల నిర్వాహకులను కలిసారు. గుంటూరు, ఏలూరుల్లోని తమ విద్యాసంస్థల్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని చెప్పడంతో శ్రీనివాస్ విడతలవారీగా రూ. 7 కోట్ల 27 లక్షలకు పైగా ఇచ్చారు. తర్వాత లాభాల్లో వాటా ఇవ్వక పోవటంతో శ్రీనివాస్ పలుమార్లు రాణి దంపతులను ప్రశ్నించారు.
విద్యాసంస్థల పేరుతో 35 కోట్ల రూపాయలు మోసం చేసిన దంపతుల్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరుకు చెందిన రాణి-ధర్మరాజు దంపతులు శ్రీహర్షిత విద్యాసంస్థల విస్తరణ పేరుతో పెద్ద మొత్తంలో వసూళ్లు చేశారు. భాగస్వామ్యం ఇస్తామని నమ్మబలికారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త శ్రీనివాస్ నుంచి దాదాపు ఏడుకోట్ల రూపాయలు వసూలు చేశారు. మొదట్లో బాగానే ఉన్నా.. ఆ తర్వాత లాభాల్లో వాటా ఇవ్వకుండా బెదిరింపులకు దిగారు. వ్యాపారవేత్త పోలీసుల్ని ఆశ్రయించడంతో . దీంతో దంపతుల్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.
హిమాయత్‌నగర్‌లో ఐటీ కంపెనీ నిర్వహిస్తున్న శ్రీనివాస్.. అమెరికాలోని తన స్నేహితుడు సుధాకర్ సూచనతో శ్రీహర్షిత విద్యాసంస్థల నిర్వాహకుల్ని కలిశాడు. గుంటూరు, ఏలూరులోని తమ విద్యాసంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయని నమ్మించారు. దీంతో 7కోట్ల 27 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు శ్రీనివాస్. ఆ తర్వాత లాభాల్లో వాటాలు ఇవ్వకపోగా.. రాణి దంపతులు బెదిరింపులకి దిగారు. దీంతో సీసీఎస్ పోలీసుల్ని ఆశ్రయించాడు శ్రీనివాస్. కేసు నమోదు చేసి దంపతుల్ని అరెస్ట్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.