- Telugu News Photo Gallery Egypt queen cleopatra world most beautiful queen photo gallery Telugu News
ప్రపంచంలోనే అందమైన రాణి క్లియోపాత్రా.. ఆమె సౌందర్య రహస్యం గాడిద పాలతో స్నానం..!
ప్రపంచంలో చాలా మంది రాజులు, రాణులు ఉన్నారు. వారి కథలు మనం ఇప్పటికీ చదువుతున్నాము. చాలా మంది రాజులు, రాణులకు సంబంధించిన కథలు వింటుంటాము. అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి కథే ఈజిప్టు రాణి క్లియోపాత్రాది కూడా. ఈ రాణి చాలా భిన్నమైన జీవితాన్ని గడిపింది. ఆమె గురించిన పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Sep 03, 2023 | 5:00 PM

ఈజిప్టును పరిపాలించిన మహారాణి క్లియోపాత్రా. ప్రపంచంలోనే అత్యంత అందమైన రాణిగా ఈజిప్ట్ రాణి క్లియోపాత్రా ప్రత్యేక గుర్తింపును పొందారు. అంతేకాదు రాజకీయ వ్యూహాలు రచించడంలో ఆమె సిద్ధహస్తురాలు. కొన్ని సార్లు ఆమె ఎత్తులకు మహా మహా చక్రవర్తులే చిత్తయిపోయారని అంటారు.

రాణి క్లియోపాత్రా.. సింహాసనంపై తన పట్టును కొనసాగించడానికి ఆమె తన ఇద్దరు సోదరులను వివాహం చేసుకుందని చెబుతారు.ఆ తర్వాత క్వీన్ క్లియోపాత్రా చాలా కాలంపాటు పరిపాలించింది. కానీ, ఆమె మరణం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈజిప్ట్ రాణి క్లియోపాత్రా 51 BC నుండి 30 BC వరకు ఈజిప్టును పాలించింది.

చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం.. క్వీన్ క్లియోపాత్రా తను అందంగా కనిపించడానికి ప్రతిరోజూ ఉదయం గాడిద పాలతో స్నానం చేసేదని చెబుతారు. ఆ గాడిద పాలలో 300 గులాబీలను వేసుకుని ఆమె స్నానం చేసేదని చెప్పుకుంటారు.

ఇకపోతే, క్వీన్ క్లియోపాత్రా పరిపాలన దక్షత..ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఆమె తన సొంత సోదరుడు టోలెమీని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె తన సోదరుడిని అదుపులో ఉంచుకోవడానికి మరోకరిని మళ్లీ పెళ్లి చేసుకుందని చరిత్రకారులు చెబుతున్నారు.

ఆ తర్వాత క్వీన్ క్లియోపాత్రా ఊహించని పన్నాగం పన్నింది. జూలియస్ సీజర్‌తో కలిసి తన ఇద్దరు సోదరులను అడ్డు తొలగించింది. దాంతో ఆమె సింగిల్‌గానే ఈజిప్ట్ సింహాసనాన్ని పాలించినట్టుగా చెబుతారు.





























