Rajinikanth Movies: 80లలో బిల్లా నుంచి తాజాగా జైలర్ వరకు రికార్డ్స్ బ్రేక్ చేసిన రజినీకాంత్ చిత్రాలు..
జైలర్ సినిమాతో రేర్ రికార్డ్ సెట్ చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్. 50 ఏళ్లుగా స్టార్ హీరోగా కొనసాగటమే కాదు. ప్రతీ ఏడాది ఓ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్‌గా అవతరించారు తలైవా. అందుకే జైలర్ సక్సెస్‌ను నెక్ట్స్ లెవల్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. దాదాపు పదేళ్లుగా సరైన హిట్ లేని రజనీకాంత్, జైలర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. తలైవా మేనియా ఇది, అనే రేంజ్ హిట్ పడటంతో ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. గత యాబై ఏళ్లలో ప్రతీ దశాబ్దంలోనూ ఓ ఇండస్ట్రీ హిట్‌తో ఫ్యాన్స్‌ను అలరించారు రజనీకాంత్.