Telangana: ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్.. పెళ్లిలోనే రాజకీయ నినాదాలు
హైదరాబాద్‌లో జరిగిన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడి వివాహానికి హాజరయ్యారు సీఎం కేసీఆర్. అయితే ఇది మామూలుగా జరిగే విషయం. ముఖ్యమైన నేతల ప్రముఖుల పెళ్లిలకు సీఎం కేసీఆర్ హాజరవుతూ ఉంటారు. అయితే ఈ పెళ్లి మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొద్దిరోజుల క్రితం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లంటూ అభ్యర్థుల జాబితా ప్రకటించిన కేసీఆర్ కామారెడ్డిలో మాత్రం తానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్‌కు అవకాశం దక్కలేదు.
హైదరాబాద్‌లో జరిగిన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడి వివాహానికి హాజరయ్యారు సీఎం కేసీఆర్. అయితే ఇది మామూలుగా జరిగే విషయం. ముఖ్యమైన నేతల ప్రముఖుల పెళ్లిలకు సీఎం కేసీఆర్ హాజరవుతూ ఉంటారు. అయితే ఈ పెళ్లి మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొద్దిరోజుల క్రితం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లంటూ అభ్యర్థుల జాబితా ప్రకటించిన కేసీఆర్ కామారెడ్డిలో మాత్రం తానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్‌కు అవకాశం దక్కలేదు. పార్టీ ఈ విషయంలో గంప గోవర్ధన్‌కు ఎలాంటి హామీ కూడా ఇవ్వలేదు. అయినా గంప గోవర్ధన్ మాత్రం ముఖ్యమంత్రి కామారెడ్డిలో పోటీ చేయడానికి స్వాగతించారు. కొంతమందితో వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి పూర్తి మద్దతు తెలిపారు.
ఈ పరిణామాలు నేపథ్యంలోనే కామారెడ్డిలో కొంతమంది కార్యకర్తలు మాత్రం గంప గోవర్ధన్ మళ్లీ పోటీ చేయాలని కూడా పట్టుపట్టారు. ఇదే సమయంలో హైదరాబాదులో జరిగిన గంపా గోవర్ధన్ పెళ్లికి హాజరైన సీఎం కేసీఆర్‌కు అక్కడ భారీ ఎత్తున నినాదాలు వినిపించాయి. కెసీఆర్ రావాలి, కామారెడ్డికి స్వాగతం అంటూ పెళ్లి ప్రాంగణం దద్దరిల్లింది. ఎమ్మెల్యే కుమార్ రెడ్డి పెళ్లి కావడంతో కామారెడ్డి నుంచి భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడానికి మద్దతు తెలిపే స్థలం, సందర్భం కాకపోయినా ఇదే అవకాశం అని అంతా భావించారు. యువకులు పెద్ద ఎత్తున కేరింతలతో స్వాగత నినాదాలు చేశారు. దీంతో సీఎం కేసీఆర్ కూడా వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ, సెల్ఫీలు దిగుతూ అభివాదం చేస్తూ వెళ్లారు.
కామారెడ్డి లో కొంత వ్యతిరేకత ఉంది అని భావించిన ప్రతిపక్షాలకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఇక్కడ ఇలా ఉంటే ఇక కేసీఆర్ కామారెడ్డి వెళ్తే ఎలా ఉంటుందో చూడండి అంటున్నారు భారత రాష్ట్ర సమితి నేతలు. ఇదిలా మరోవైపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ 115 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ప్రకటించేశారు. అయితే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాత్రం ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రస్తుతం వారిని వెతికే పనిలో నిమగ్నమయ్యాయి. ఇక మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలుకానుంది. ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్ ఈసారి గజ్వేల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డిలో కూడా పోటీచేయడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈసారి కూడా తాము అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నేత స్పష్టంగా చెప్పేస్తున్నారు. అయితే అధికార పార్టీ ఎన్ని సీట్లు దక్కించుకుంటుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.