Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: టీ కాంగ్రెస్ లో ఫ్యామిలీ ప్యాక్.. కుటుంబ సభ్యులకు టికెట్లు అడుగుతున్న నేతల లిస్ట్‌ ఇదే..

Telangana: ఇలా ఫ్యామిలీ ప్యాక్ లు ఇచ్చుకుంటూ పోతే మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారట మిగతా నేతలు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ను కచ్చితంగా అమలు చేసి..ఒక కుటుంబానికి ఒకే టికెట్ సూత్రాన్ని వర్తింప చేయాలని ఆశావాహులు పట్టుబడుతున్నారు. దీంతో కుటుంబానికి అడిగినన్ని టికెట్లు ఇవ్వకపోతే సీనియర్లతో బాధ.. ఇస్తే ఆశావాహులతో సమస్య.. ఎలా

Telangana: టీ కాంగ్రెస్ లో ఫ్యామిలీ ప్యాక్.. కుటుంబ సభ్యులకు టికెట్లు అడుగుతున్న నేతల లిస్ట్‌ ఇదే..
Telangana Congress
Follow us
TV9 Telugu

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 03, 2023 | 5:26 PM

టీ కాంగ్రెస్ ధరఖాస్తుల పరిశీలనలో పలు కీలక అంశాలు తెరపైకి వచ్చాయి. పలువురు సీనియర్ నేతలు ఫ్యామిలీ ప్యాక్ ను ప్రదేశ్ ఎన్నికల కమిటీ ముందు ఉంచారు.. దీంతో ఓక్కరికి టిక్కెట్ ఇవ్వడమే గగనం అనుకుంటే ఈ ఫ్యామిలీ గొడవ ఏంటి రా బాబు అని హస్తం నేతలు తలలు పట్టుకున్నారు. ఓక్కో నేత నాకు, నా కొడుక్కి.. మరో నేత నాకు నా భార్యకు.. ఇంకో నేత నాకు నా కూతురుకు అంటూ లాబింగ్ మొదలు పెట్టారు. ఇదేంటి అంటే మా పార్టీ మా ఇష్టం. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసాము..కుటుంబమంతా కష్టపడుతోంది.. రెండు టిక్కెట్లు ఇవ్వాల్సిందే అంటున్నారట సదరు నేతలు…

ఓకే కుటుంబానికి రెండు టికెట్లు అడుగుతున్న వారిలో ఉత్తంకుమార్ రెడ్డి, జానారెడ్డి, కొండా సురేఖ, బలరాం నాయక్, సీతక్క, దామోదర రాజనర్సింహ, అంజన్ కుమార్ యాదవ్‌ ఉన్నారు..ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఫ్యామిలీలో తనకు ,తన భార్య ఉత్తమ్ పద్మవతి కి ఇద్దరికీ టికెట్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉత్తమ్ పద్మావతి మాజీ ఎమ్మెల్యే కావడం తో టిక్కెట్ విషయం లో ఏఐసీసీ సానుకూలంగా ఉంటుంది అనే చర్చ జరుగుతుంది.ఇక జానారెడ్డి తన ఇద్దరు కొడుకులు రఘువీర్ రెడ్డి ,జై వీర్ రెడ్డి లకు నాగార్జున సాగర్ ,మిర్యాలగూడ టిక్కెట్ అడుగుతున్నారు. ఎమ్మెల్యే సీతక్క తన కొడుకు సూర్యం ను ఈ ఎన్నికల్లో బరిలో దింపాలనుకుంటుంది.. సూర్యం కు పినపాక టిక్కెట్ అడుగుతున్నారు. మరోనేత బలరాం నాయక్ తనకు మహాబూబాబాద్ టిక్కెట్, తన కొడుకు సాయిరాం శంకర్ కు ఇల్లందు టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు కొండా మురళి దంపతులు రెండు టిక్కెట్ ల కోసం పట్టుబడుతున్నారు. కొండ మురళీ పరకాల, కొండ సురేఖ వరంగల్ తూర్పు టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇక దామోదర రాజనర్సింహ ఫ్యామిలీ నుండి కూడా దామోదర తో పాటు తన కూతురు దరఖాస్తు ధాఖలు చేసింది.. అయితే ఇందులో టిక్కెట్ తనకు కాకపోతే తన కూతురు కు టిక్కెట్ ఇవ్వాలని దామోదర రాజనర్సింహ ముడిపెడుతున్నారట. ఇక మరోనేత అంజన్ కుమార్ యాదవ్ అయితే తనకు తన ఇద్దరు కొడుకులకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట. ముషీరాబాద్ టిక్కెట్ తనకు లేదంటే తన పెద్ద కొడుకు అనీల్ కు, గోషామహాల్ టిక్కెట్ తన చిన్న కొడుక్కి ఇవ్వాలనే ప్రతిపాదనను ప్రదేశ్ ఎన్నికల కమిటీ ముందు ఉంచారట. మరోవైపు కాంగ్రెస్ లో చేరాలనుకునే నేతలు సైతం రెండు టికెట్ల ప్రతిపాదననే ముందు ఉంచుతున్నారట.

ఇవి కూడా చదవండి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ తనకు తన భర్త కు టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుందట. మరోనేత మైనంపల్లి తో చర్చలు జరిపిన కాంగ్రెస్ నేతలకు ఇదే ప్రతిపాదన ఏదురైందట. తనకు మల్కాజిగిరి, తన కొడుక్కి మెదక్ టిక్కెట్ ఇవ్వాలనే ప్రతిపాదన పెట్టారట. దీంతో ఇలా ఫ్యామిలీ ప్యాక్ లు ఇచ్చుకుంటూ పోతే మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారట మిగతా నేతలు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ను కచ్చితంగా అమలు చేసి..ఒక కుటుంబానికి ఒకే టికెట్ సూత్రాన్ని వర్తింప చేయాలని ఆశావాహులు పట్టుబడుతున్నారు. దీంతో కుటుంబానికి అడిగినన్ని టికెట్లు ఇవ్వకపోతే సీనియర్లతో బాధ.. ఇస్తే ఆశావాహులతో సమస్య.. ఎలా నెట్టుకురావాలో తెలియక హస్తం పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..