AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR BRS: సార్ ఎప్పుడొస్తారు.. ఇవ్వాలా.. రేపా..? కేటీఆర్ కోసం బీఆర్‌ఎస్‌ నేతల పడిగాపులు..

గులాబీ పార్టీ బీఆర్ఎస్ బాస్ సీఎం కేసీఆర్.. అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.. ఆ నాటి నుంచి పార్టీలో ఎన్నో పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో బీఆర్‌ఎస్‌లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాట్‌టాపిక్‌గా మారారు. గత కొద్దీరోజులుగా పార్టీలోని ఆశావహులతో మొదలు అసంతృప్తులు, సిట్టింగ్ లు అంతా అయన రాకకోసం వేయికళ్లతో వేచి చూస్తున్నారు.

KTR BRS: సార్ ఎప్పుడొస్తారు.. ఇవ్వాలా.. రేపా..? కేటీఆర్ కోసం బీఆర్‌ఎస్‌ నేతల పడిగాపులు..
Minister K Taraka Rama Rao
Sridhar Prasad
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Sep 03, 2023 | 5:35 PM

Share

గులాబీ పార్టీ బీఆర్ఎస్ బాస్ సీఎం కేసీఆర్.. అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.. ఆ నాటి నుంచి పార్టీలో ఎన్నో పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో బీఆర్‌ఎస్‌లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాట్‌టాపిక్‌గా మారారు. గత కొద్దీరోజులుగా పార్టీలోని ఆశావహులతో మొదలు అసంతృప్తులు, సిట్టింగ్ లు అంతా అయన రాకకోసం వేయికళ్లతో వేచి చూస్తున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న కేటీఆర్ నగరానికి వచ్చాకే తుది నిర్ణయం అంటున్న అధిష్టానం ఆదేశాలతో.. ఇప్పుడు అందరు కేటీఆర్ ఏంట్రీ కోసం చూస్తున్నారట. చిన్న బాస్ రాగానే.. పార్టీ నుంచి మరో నిర్ణయం ఉంటుందని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతుండటంతో.. అసంతృప్తితో ఉన్న చాలా మంది నేతలు.. కేటీఆర్ సార్ ఎప్పుడు వస్తారు.. ఇవ్వాళా..? రేపా..? వస్తే ఎన్ని గంటలకు వస్తారంటూ వాకబు చేస్తున్నారట..!

టిక్కెట్‌లు ప్రకటించి రోజులు గడుస్తున్నా BRSలో అసంతృప్తి సెగలు మాత్రం పోవడం లేదు. టిక్కెట్ రాని వాళ్ళ పంచాయితీ ఒకలా ఉంటే, టిక్కెట్ వచ్చినవారికి స్థానిక నేతలు సహకరించడంలేదనే బ్యాచ్‌ బాధలు మరోలా ఉన్నాయి. ఇక ఆశావహుల గోల మరోలా ఉంది. ఈ సమయ్యలన్నింటినీ సెట్‌చేసే పనిలో బిఆర్ఎస్ అధిష్టానం వేగం పెంచింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజవర్గాల్లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికీ అప్పుడు మానిటర్ చేస్తున్న పార్టీ అధిష్టానం, మంత్రి హరిష్‌రావును రంగంలో దించింది. ప్రతి రోజు నాయకులను పిలిచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ కేటీఆర్ వచ్చాక తుది నిర్ణయం అంటూ బుజ్జగిస్తున్నారు హరీష్‌ రావు..

చాలాచోట్ల రెబల్స్ బ్యాచ్ వెనక్కి తగ్గడం లేదు రామగుండంలో ఇప్పటికే కేటీఆర్ మాట్లాడినా.. అక్కడ సుధారాణి బ్యాచ్ మాత్రం అవసరం అయితే ఇండిపెండెంట్ గానే సై అంటూ వేరే గుర్తు కోసం ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఇక అదే బాటలో పటాన్‌చెరులో నీలంమధు, కల్వకుర్తిలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో అధిష్టానం సంప్రదింపులు జరిపినా కేటీఆర్ వచ్చాకే తుది నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నారని సమాచారం. ఇక కోదాడలో కూడా శశిధర్‌రెడ్డి కూడా పార్టీ హ్యాండ్ ఇస్తే ఇండిపెండెంట్‌గా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారట. మొత్తంమీదా కేటీఆర్‌ రాకతో ఈ సమస్యలన్నింటికీ చెక్‌ పడుతుందని అధిష్ఠానం భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక ఆశావహులు చాల మంది కూడా సిట్టింగులకు సహకరించడం లేదని అధిష్టానానికి రిపోర్ట్ వచ్చిందని.. కేటీఆర్ హైదరాబాద్ రాగానే వరుస సమావేశాలు నిర్వహించి సెట్ చేస్తారంటూ పార్టీ పెద్దలు సిట్టింగులకు ఆశావహులకు భరోసా ఇస్తున్నారు. దీంతో కేటీఆర్ రాక ప్రస్తుతం పార్టీలో ఆసక్తిగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోెసం ఇక్కడ క్లిక్ చేయండి..