Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ నియోజకవర్గంలో డీకే అరుణకు ఎమ్మెల్యేగా ఛాన్స్ దక్కుతుందా ?

గద్వాల అసెంబ్లీ సీటు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. దీంతో రెండో స్థానంలో నిలిచిన మాజీ మంత్రి డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలని 2023 ఆగస్టు 24న హైకోర్టు తీర్పు చెప్పింది. అంతేకాకుండా బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై కోర్టు జరిమాన కూడా విధించింది. కోర్టు జరిమాన కట్టడానికి గడువు దగ్గరపడటం కృష్ణమోహన్ రెడ్డిని టెన్షన్ పెడుతోంది.

Telangana: ఆ నియోజకవర్గంలో డీకే అరుణకు ఎమ్మెల్యేగా ఛాన్స్ దక్కుతుందా ?
Dk Aruna
Follow us
Ashok Bheemanapalli

| Edited By: Aravind B

Updated on: Sep 03, 2023 | 5:34 PM

గద్వాల అసెంబ్లీ సీటు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. దీంతో రెండో స్థానంలో నిలిచిన మాజీ మంత్రి డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలని 2023 ఆగస్టు 24న హైకోర్టు తీర్పు చెప్పింది. అంతేకాకుండా బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై కోర్టు జరిమాన కూడా విధించింది. కోర్టు జరిమాన కట్టడానికి గడువు దగ్గరపడటం కృష్ణమోహన్ రెడ్డిని టెన్షన్ పెడుతోంది. పెనాల్టీ కడితే తప్పును అంగీకరించినట్లు అవుతుంది.. కట్టకపోతే కోర్టు ధిక్కారం అవుతుంది. ఏం చేయాలో తెలియక న్యాయ నిపుణుల చుట్టూ తిరుగుతున్నారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.

గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన డీకే అరుణ ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. 2004 నుంచి 2018 వరకు గద్వాల ఎమ్మెల్యేగా ఉన్నారు. వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సందర్భంలో పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి పాలమూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో గద్వాల ఎమ్మెల్యేగా గెలిచినట్లు ప్రకటించిన తన అల్లుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై న్యాయం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు హైకోర్టు కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటుతో పాటు జరిమాన వేయడంతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి పట్టు నిలబెట్టుకోవాలని ఆమె భావిస్తున్నారు.

సుదీర్ఘ న్యాయపోరాటం చేసి విజయం సాధించిన డీకే అరుణను ఇటీవల ఖమ్మం సభలో అమిత్ షా సత్కరించారు. బీజేపీ కూడా అసెంబ్లీలో తమ సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గుర్తించాలని బీజేపీ నేతలు అసెంబ్లీ కార్యదర్శిని, ఎన్నికల కమిషన్ అధికారులను కలిశారు. కోర్టు కాపీని అటు ప్రభుత్వం,.. ఇటు లీగల్ డిపార్ట్ మెంట్ పరిశీలించిన తర్వాతే ముందుకు కదిలే ఛాన్స్ ఉంది. ఒకవేళ అన్నీ ఒకే అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తే…ఎన్నో సందేహాలు.. మరెన్నో చిక్కుముడులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంత టైం ఎమ్మెల్యేగా ఉన్నామన్నది ముఖ్యం కాదని… ప్రత్యర్థిపై పంతం నెగ్గింకోవడమే లక్ష్యమంటున్నారు గద్వాల జేజమ్మ. డీకే అరుణ అనే నేను…అంటూ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఇప్పట్లో దక్కుతుందో లేదో చూడాలి. ఇదిలా ఉండగా ఇప్పటికే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే 115 నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థలను ప్రకటించేశారు. ఇక కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులను వెతికే పనిలో పడ్డాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.