Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: Srisailam: శ్రీశైలంలో ముగిసిన వరుణ జపాలు.. అంతలోనే హఠాత్తుగా కురిసిన భారీ వర్షం..

Andhra Pradesh: వర్షాభావ పరిస్థితులు తొలగి సకాలంలో తగినంత వర్షాలు కురిసి రాష్ట్రం,దేశం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో శ్రీశైలం దేవస్థానం వరుణ హోమాలను వరుణ జపాలను వారంరోజుల పాటు నిర్వహించింది. గత నెల 26న ప్రారంభించిన ఈ జపాలు,హోమాలు ఈరోజు పూర్ణాహుతితో ముగిశాయి. పూర్ణాహుతి కార్యక్రమంలో నూతన వస్త్రాలు పలు సుగంధ ద్రవ్యాలు మొదలైనవి

Andhra Pradesh: Srisailam: శ్రీశైలంలో ముగిసిన వరుణ జపాలు.. అంతలోనే హఠాత్తుగా కురిసిన భారీ వర్షం..
Varun Japam
Follow us
J Y Nagi Reddy

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 02, 2023 | 10:14 PM

రాష్ట్రంలో వర్షాలు అనుకున్న స్థాయిలో కురావకపోవడంతో శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో వర్షాలు మరింత సమృద్ధిగా కురావలని రాష్ట్రంలోని ప్రాజెక్టులన్ని నిండాలని అలానే రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ దేవస్థానం వారంరోజుల పాటు ఆలయంలో వరుణ జపాలు,హోమాలు నిర్వహించారు. గతనెల 26 ప్రారంభమైన వరుణ జపాలు,హోమాలు ఆలయంలోని స్వామివారి యాగశాలలో దేవస్థానం అర్చకులు,ఇతర ప్రాంతల నుండి వచ్చిన అర్చకస్వాములు కూడా ఈ జపాలు,హోమాలలో పాల్గొన్నారు ఆలయం నిరంతరం హోమాలు,జపాలు చేశారు ఒకపక్క హోమం,జపాలు జరుగుతున్న సమయంలోనే నిన్నటి రోజు హఠాత్తుగా వర్షం కురవడం అలానే ఇతర ప్రాంతాలలో కూడా వర్షం కురవడంతో భక్తులు హర్షం వ్యక్తంచేశారు

శ్రీశైలంలో ఎనిమిది రోజులపాటు జరిగిన వరుణ జపాలు పూర్ణాహుతితో ఘనంగా ముగింపు పలికారు. వర్షాభావ పరిస్థితులు తొలగి సకాలంలో తగినంత వర్షాలు కురిసి రాష్ట్రం,దేశం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో శ్రీశైలం దేవస్థానం వరుణ హోమాలను వరుణ జపాలను వారంరోజుల పాటు నిర్వహించింది. గత నెల 26న ప్రారంభించిన ఈ జపాలు,హోమాలు ఈరోజు పూర్ణాహుతితో ముగిశాయి. పూర్ణాహుతి కార్యక్రమంలో నూతన వస్త్రాలు పలు సుగంధ ద్రవ్యాలు మొదలైనవి యజ్ఞగుండంలో ఆహుతిగా సమర్పించబడ్డాయి ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్.లవన్న ఆలయ అర్చకస్వాములు పాల్గొన్నారు.

శ్రీశైలంలో చేపట్టిన వరుణ యాగం పుణ్యమో లేక ఇతర కారణము తెలియదు కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని చాలా ప్రాంతాలలో వర్షాలు కురిశాయి ఎండుతున్న పంటలకు ప్రాణం పోశాయి…

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..