Health Tips :అరటిపండుతో ఈ పండును కలిపి తింటున్నారా..? మీ శరీరంలో విషం వ్యాపిస్తుంది..! జాగ్రత్తపడు

బొప్పాయి పండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్, మధుమేహానికి మేలు చేస్తుంది. రెండు పండ్లను విడివిడిగా తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. కానీ కలిపి తినడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం, అరటిపండు శరీరాన్ని చల్లబరుస్తుంది. బొప్పాయి శరీరాన్ని వేడి చేస్తుంది. ఈ రెండు పదార్థాలను కలిపి తింటే జీర్ణశక్తి క్షీణించి తలనొప్పి, ..

Health Tips :అరటిపండుతో ఈ పండును కలిపి తింటున్నారా..? మీ శరీరంలో విషం వ్యాపిస్తుంది..! జాగ్రత్తపడు
Eat Bananas And Papaya
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 02, 2023 | 9:53 PM

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలిసిందే. ప్రతి రోజు పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు కూడా చెబుతుంటారు. అయితే, పండ్లను తినే క్రమంలో చాలా మంది వాటిని ఫ్రూట్ సలాడ్స్‌ రూపంలో చేసుకుని తింటుంటారు. అయితే, అయితే ఫ్రూట్ సలాడ్ తినేటప్పుడు కొన్ని పండ్లను కలిపి తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి పండ్లను కలిపి తినటం వల్ల మంచికంటే, చెడు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని అనుకుంటారు. ఈ పండ్లను ఒక్కొక్కటిగా తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. అయితే అరటి పండుతో పాటు కొన్ని పండ్లను తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది.

ఒక్కో పండు స్వభావం ఒక్కోలా ఉంటుంది. విభిన్న స్వభావం గల రెండు పండ్లను కలిపి తినడం హానికరం. ఆయుర్వేదం ప్రకారం అరటి, బొప్పాయి పండు కలిపి తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం. అవును.. గుండె, పొట్ట ఆరోగ్యానికి అరటిపండు ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి పండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్, మధుమేహానికి మేలు చేస్తుంది. రెండు పండ్లను విడివిడిగా తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. కానీ కలిపి తినడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం, అరటిపండు శరీరాన్ని చల్లబరుస్తుంది. బొప్పాయి శరీరాన్ని వేడి చేస్తుంది. ఈ రెండు పదార్థాలను కలిపి తింటే జీర్ణశక్తి క్షీణించి తలనొప్పి, వాంతులు, తల తిరగడం, అలర్జీ, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు.

కొన్ని పరిశోధనల ప్రకారం, అరటిపండు గుండె, పొట్ట ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆస్తమా లేదా శ్వాస సమస్యలు ఉన్నవారు బొప్పాయి తినకూడదు. బొప్పాయి తినడం వల్ల అలర్జీ వస్తుంది. అంతే కాకుండా మొటిమలు, దురద వంటి చర్మ సమస్యలు ఉన్నవారు కూడా బొప్పాయి తినకుండా ఉండాలి.

ఇవి కూడా చదవండి

గర్భిణీ స్త్రీలు కూడా బొప్పాయి తినడం మానుకోవాలి. బొప్పాయి శరీరాన్ని వేడి చేస్తుంది. కాబట్టి గర్భధారణ సమయంలో బొప్పాయి తింటే పిండంకి హాని కలుగుతుంది. అలాగే, బొప్పాయి తినడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు కానీ అధికంగా తీసుకుంటే అది శరీరానికి హానికరం. బొప్పాయి కలిపి తీసుకోవడం వల్ల తీవ్రమైన సమస్యలు వస్తాయి.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..