Devil’s Forest: ఇది ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన, భయానకమైన అడవి.. ఇక్కడి వెళ్లిన వారు..
ఇది ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన, భయానకమైన అడవి అని చెబుతారు. రాత్రిపూట ఈ అడవి నుండి ఏడుపులు శబ్ధాలు వినిపిస్తాయి. అంతేకాదు.. ఈ అడవిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని నమ్ముతారు. ఈ అడవికి వెళ్లే వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అంటారు.
Updated on: Sep 02, 2023 | 8:35 PM

ఈ అడవికి వచ్చిన వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని సమాచారం. అందుకే ఈ అడవిని దెయ్యాల అత్యంత రహస్యమైన అడవి అని అంటారు. ఈ అడవి టోక్యో నుండి రెండు గంటల దూరంలో ఉంది.

ఈ అడవిలో దయ్యాలు ఉంటాయని చెబుతారు. ఈ దెయ్యాలు ఆత్మహత్యకు ప్రేరేపిస్తాయని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ అడవి సమీపంలోకి వెళ్లాలంటే కూడా భయంతో వణికిపోతారు.

ఈ రహస్యమైన అడవిని ఆత్మాహుతి అడవి అంటారు. ఈ అడవి జపాన్‌లో ఉంది. ఈ అడవిలో తరచూ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ పచ్చటి అడవి చూడ్డానికి అంతులేనిది. అడవిలోని నిశ్శబ్దం కూడా ఒక రకంగా భయపెడుతుంది.

ప్రపంచంలోని అత్యంత రహస్యమైన, భయానకమైన అడవిలో ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటారని చాలా మందికి తెలియదు. ఈ అడవి వెనుక రహస్యం ఇంకా వెలుగులోకి రాలేదు. అందుకే దీన్ని ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన సూసైడ్ పాయింట్ అంటారు. ఈ అడవి గురించి నిరంతరం పరిశోధనలు జరుగుతున్నాయి.

మెక్సికో నగరానికి సమీపంలో ఉన్న ఈ ద్వీపంలోని చెట్లు వందలాది బొమ్మలతో కట్టివేయబడి ఉంటాయి. గగుర్పాటు కలిగించే, భయానక-సినిమా-శైలిని కలిగి ఉంటాయి. ఈ ద్వీపంలో నివసించే..ఏకైక వ్యక్తి.. డాన్ జూలియన్ సంటానా 50 సంవత్సరాల క్రితం అక్కడి కాలువలో ఒక అమ్మాయి మృతదేహాన్ని చూశాడు. అతను అదే నీటిలో తేలుతున్న ఒక బొమ్మను కూడా చూశాడు. 2001లో తను కూడా చనిపోయాడు.





























