Srisailam: మల్లన్నకు చెన్నై భక్తురాలు భూరికానుకలు.. ఈవోకు బంగారు పళ్లెం అందజేత..
మలాదేవి సహా కుటుంబస సభ్యులకు అమ్మవారి ఆలయ ప్రాంగణములోని ఆశీర్వచన మండపంలో వేద ఆశీర్వాదాన్ని అందజేశారు. అనంతరం ఈ బంగారు పళ్లాన్ని ఆలయ ఈవో డి.పెద్దిరాజుకు భక్తులు అందజేశారు. అనంతరం దాతలకు శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను ప్రసాదాలను, స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందజేసి సత్కరించారు
చెన్నైకి చెందిన మల్లన్న భక్తురాలు స్వామివారికి భూరికానుకలను సమర్పించారు. శ్రీశైలం క్షేత్రంలోని మల్లన్న భ్రమరాంబలను దర్శించుకున్న అనంతరం ఆలయ ఈవో కు బంగారు పళ్లెం ను అందజేశారు.
శ్రీశైలం దేవస్థానానికి చెన్నైకి చెందిన భక్తులరాలు విమలాదేవి తమ కుటుంబ సభ్యులతో కలిసి బంగారు పళ్లెమును విరాళం సమర్పించారు. 343 గ్రాములతో ఈ బంగారు పళ్ళెమును తయారు చేయించినట్లు దాతలు తెలిపారు. మల్లికార్జునస్వామి, బ్రమరాంబదేవి అమ్మవార్ల నిత్య కైంకర్యాలలో వినియోగించేందుకు ఈ బంగారు పళ్లెం ఇచ్చినట్లు చెప్పారు. విమలాదేవి సహా కుటుంబస సభ్యులకు అమ్మవారి ఆలయ ప్రాంగణములోని ఆశీర్వచన మండపంలో వేద ఆశీర్వాదాన్ని అందజేశారు. అనంతరం ఈ బంగారు పళ్లాన్ని ఆలయ ఈవో డి.పెద్దిరాజుకు భక్తులు అందజేశారు.
అనంతరం దాతలకు శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను ప్రసాదాలను, స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందజేసి సత్కరించారు .ఈ కార్యక్రమములో ఆలయ ఏ ఈవో హరిదాసు, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..