AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేడు మన రైల్వేలకు చారిత్రక రోజు.. 41 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్ట్స్‌ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ

రైల్వే ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగు పరిచేందుకు వారి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 553 స్టేషన్లను తిరిగి అభివృద్ధి చేస్తారు. ఈ స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నారు. భారతదేశం అంతటా ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు కూడా ప్రారంభించనున్నారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవిత విధానాన్ని మరింత సులభతరం చేస్తాయి. పీఎం మోడీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. 

నేడు మన రైల్వేలకు చారిత్రక రోజు.. 41 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్ట్స్‌ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ
Historic Day For Railways
Surya Kala
|

Updated on: Feb 26, 2024 | 10:24 AM

Share

భారతీయ రైల్వే వ్యవస్థకు నేడు(ఫిబ్రవరి 26వ తేదీ) చారిత్రాత్మకమైన రోజు అని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు దేశానికి వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. ఇందులో అనేక రైల్వేలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. 41,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన రెండు వేల రైల్వే , మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రారంభోత్సవముతో పాటు ఈ ప్రాజెక్ట్స్ ను జాతికి అంకితం చేయనున్నారు. అమృత్ భారత స్టేషన్ పథకం కింద భారీగా రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాన మంత్రి మోడీ శంకుస్థాపన చేయనున్నారు.

పీఎం మోదీ మంత్రం

రైల్వే ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగు పరిచేందుకు వారి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 553 స్టేషన్లను తిరిగి అభివృద్ధి చేస్తారు. ఈ స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నారు. భారతదేశం అంతటా ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు కూడా ప్రారంభించనున్నారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి. పీఎం మోడీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

స్టేషన్లలో ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు..మీడియా

అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 533 రైల్వే స్టేషన్లు ఎంపిక చేయబడ్డాయి. రూ.19,000 కోట్లకు పైగా ఖర్చుతో స్టేషన్లను పునరాభివృద్ధి చేయనున్నారు. స్టేషన్లలో ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. వీటిలో పైకప్పులు, ప్లాజాలు, అందమైన ల్యాండ్‌స్కేపింగ్, ఇంటర్ మోడల్ కనెక్టివిటీ, మెరుగైన ఆధునిక ముఖ భాగం, పిల్లలకు ఆట స్థలం, కియోస్క్‌లు, ఫుడ్ కోర్టులు మొదలైనవి ఉన్నాయి. ఇవి పర్యావరణాన్ని అభివృద్ధి చేయడంతో పాటు వికలాంగులకు అనుకూలంగా ఉంటాయి. స్టేషన్ భవనాల రూపకల్పన స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్పం నుంచి ప్రేరణగా తీసుకున్నారు.

గేట్ వ్యవస్థ రద్దుకు కసరత్తు:

రైల్వే క్రాసింగ్ వద్ద ఏర్పాటు చేసిన గేట్లను ఆధునీకరించి పనిలో రైల్వే అధికారులు ఉన్నారు. మానవ సహిత లెవల్ క్రాసింగ్ గేట్లను రద్దు చేసేందుకు రైల్వే శాఖ వేగంగా కృషి చేస్తుంది. దీని వల్ల రైళ్ల వేగం పెరగడమే కాకుండా రైలు, రోడ్డు ట్రాఫిక్ కూడా వేర్వేరుగా ఉండనుంది. రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకం ఉండదు.  నగరంలో ట్రాఫిక్‌ వ్యవస్థ కూడా సజావుగా సాగుతుంది. రైళ్ల రాకపోకల కారణంగా లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద ట్రాలీలు, ఇతర వాహనాల రద్దీ ఉండదు. దీంతో ప్రమాదాలు తగ్గడమే కాకుండా రైలు ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది.

మానవ సహిత లెవల్ క్రాసింగ్‌ల తొలగింపు గూడ్స్ రైళ్ల రాకపోకలను సులభతరం చేయడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది. రైల్వే క్రాసింగ్‌ల వద్ద వేచి ఉండే వాహనాలు నగరంలో కాలుష్యానికి దోహదపడుతున్నాయి. నిర్మాణం పూర్తయితే పర్యావరణ కాలుష్యం స్థాయి తగ్గుతుంది. సగటున, రైల్వే ప్రతిరోజూ 1,200 కంటే ఎక్కువ ప్యాసింజర్ , ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది. ప్రతిరోజు రెండు కోట్ల మంది ప్రయాణికులు దీని ద్వారా ప్రయాణిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..