Indian Army: సైనిక వీరులకు సెల్యూట్.. మీరే లేకపోతే ఆ 500 మంది పర్యాటకులా పరిస్థితి.?

సిక్కింలో బుధవారం ఒక్కసారిగా భారీ హిమపాతం కురిసింది. అకస్మాత్తుగా సంభవించిన ఈ భారీ హిమపాతంలో వందలాదిమంది పర్యాటకులు చిక్కుకుపోయారు. తూర్పు సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ సైనికులు మంచులో చిక్కుకున్న పర్యాటకుల ప్రాణాలను కాపాడారు. బుధవారం తూర్పు సిక్కింలోని నటులాలో భారీ హిమపాతం కురియడంతో 500 మంది పర్యాటకులు మంచులో చిక్కుకుపోయారు.

Indian Army: సైనిక వీరులకు సెల్యూట్.. మీరే లేకపోతే ఆ 500 మంది పర్యాటకులా పరిస్థితి.?

|

Updated on: Feb 26, 2024 | 10:32 AM

సిక్కింలో ఒక్కసారిగా భారీ హిమపాతం కురిసింది. అకస్మాత్తుగా సంభవించిన ఈ భారీ హిమపాతంలో వందలాదిమంది పర్యాటకులు చిక్కుకుపోయారు. తూర్పు సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ సైనికులు మంచులో చిక్కుకున్న పర్యాటకుల ప్రాణాలను కాపాడారు. బుధవారం తూర్పు సిక్కింలోని నటులాలో భారీ హిమపాతం కురియడంతో 500 మంది పర్యాటకులు మంచులో చిక్కుకుపోయారు. వీరిని గమనించిన ఆర్మీ సైనికులు వెంటనే అప్రమత్తమై పర్యాటకులను రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అకస్మాత్తుగా కురిసిన భారీ మంచు కారణంగా పర్యాటకులతో పాటు దాదాపు 175 వాహనాలు మంచులో కూరుకుపోయాయి. భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ పర్యాటకులను కాపాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆర్మీ తెలిపింది. దీనికిముందు ఫిబ్రవరి 20న జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భారీ హిమపాతం కారణంగా చిక్కుకుపోయిన వాహనాలను తరలించడంలో సీఆర్‌పీఎఫ్ సైనికులు సహాయం అందించారు. భారీ వర్షం, హిమపాతం కారణంగా శ్రీనగర్‌-జమ్మూ జాతీయ రహదారిలో కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us