Rhea Chakravarthy: రియా చక్రవర్తికి ఊరట..! లుక్ అవుట్ నోటీస్ రద్దు.. వీడియో.
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు నటి రియా చక్రవర్తి చుట్టూ తిరుగుతూనే ఉంది. రియా చక్రవర్తితో పాటు ఆమె కుటుంబంపై సైతం అనేక ఆరోపణలు వచ్చాయి. మృతిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. రియాతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై సీబీఐ జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను బాంబే హైకోర్టు తాజాగా రద్దు చేసింది. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్, తండ్రి రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ ఇంద్రజిత్ చక్రవర్తి..
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు నటి రియా చక్రవర్తి చుట్టూ తిరుగుతూనే ఉంది. రియా చక్రవర్తితో పాటు ఆమె కుటుంబంపై సైతం అనేక ఆరోపణలు వచ్చాయి. మృతిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. రియాతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై సీబీఐ జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను బాంబే హైకోర్టు తాజాగా రద్దు చేసింది. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్, తండ్రి రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ ఇంద్రజిత్ చక్రవర్తి విదేశాలకు వెళ్లకుండా జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను ద్విసభ్య ధర్మాసనం రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. 2020లో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబయిలోని తన ఫ్లాట్‌లో శవమై కనిపించాడు. కుటుంబంతో కలిసి రియా సుశాంత్‌కు డ్రగ్స్ ఇచ్చిందని ఓ ఆరోపణ. ఈ కేసులో సుశాంత్‌తో పాటు ఆమె సోదరుడు సైతం అరెస్టు అయ్యారు. ఆ తర్వాత కోర్టు బెయిల్ మంజూరవగా విడుదలయ్యారు. అయితే, ఇప్పటికీ మృతిపై చాలా కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. నటుడి మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా కుటుంబం విదేశాలకు పారిపోకుండా సీబీఐ లుక్ అవుట్ సర్క్యూలర్ జారీ చేసింది. ఇటీవల రియా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు సర్క్యూలర్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..