Congress MLA: గుండెపోటుతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మృతి.. సంతాపం తెలిపిన కర్ణాటక ముఖ్యమంత్రి

కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ సూర్పూర్ నియోజక వర్గం ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్‌ (66) ఆదివారం (ఫిబ్రవరి 25) మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన బెంగళూరులోని మణిపాల్‌ ఆసుపత్రిలో ఆదివారం మధ్యాహ్నం 1:50 గంటలకు గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఈ మేరకు బెంగళూరు మున్సిపల్‌ ఆసుపత్రి ప్రకటించింది. ఆయన ఆరోగ్యానికి..

Congress MLA: గుండెపోటుతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మృతి.. సంతాపం తెలిపిన కర్ణాటక ముఖ్యమంత్రి
MLA Raja Venkatappa Naik
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 26, 2024 | 10:17 AM

కర్ణాటక, ఫిబ్రవరి 26: కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ సూర్పూర్ నియోజక వర్గం ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్‌ (66) ఆదివారం (ఫిబ్రవరి 25) మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన బెంగళూరులోని మణిపాల్‌ ఆసుపత్రిలో ఆదివారం మధ్యాహ్నం 1:50 గంటలకు గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఈ మేరకు బెంగళూరు మున్సిపల్‌ ఆసుపత్రి ప్రకటించింది. ఆయన ఆరోగ్యానికి సంబంధించి మరేఇతర సమాచారం బయటికి వెళ్లడించలేదు. ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్‌ విజ్ఞప్తి మేరకు ఆ విషయాలు గొప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. కాగా నెల రోజుల క్రితమే రాజా వెంకటప్ప నాయక్‌ గిడ్డంగుల కార్పొరేషన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఆయన అత్యంత సన్నిహితుడు. ఆయన మృతిపట్ల సోషల్‌ మీడియా వేదికగా ఖర్గే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామితో పాటు పలువురు సంతాపం తెలిపారు.

ఎమ్మెల్యే మృతిపట్ల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య విచారం వ్యక్తం చేశారు. ‘సూర్పూర్ ఎమ్మెల్యే, నా చిరకాల రాజకీయ సహచరుడు రాజా వెంకటప్ప నాయక మరణ వార్త విని చాలా బాధపడ్డాను. మూడు రోజుల క్రితం ఆయనను కలుసుకుని ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాను. పరోపకారి అయిన రాజా వెంకటప్ప మరణం వ్యక్తిగతంగా, రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఆ బాధను తట్టుకునే శక్తి లభించాలని ప్రార్థిస్తున్నాను.’ అని సిద్ధ రామయ్య ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.

ఇవి కూడా చదవండి

కాగా రాజా వెంకటప్ప నాయక్‌ 2023 మేలో సూర్పూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సోమవారం షోరాపూర్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.