AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 WITT: భారత్ ప్రపంచానికి ఆశాకిరణం.. ఎన్నో సవాళ్లను అధిగమిస్తుందిః టీవీ సీఈవో బరున్ దాస్

టీవీ9 ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న What India Thinks Today శిఖరాగ్ర సదస్సు రెండవ ఎడిషన్‌ రెండోరోజు ఢిల్లీలో ప్రారంభమైంది. దేశంలోనే నంబర్ వన్ న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 'వాట్ ఇండియా థింక్స్ టుడే' గ్లోబల్ సమ్మిట్‌లో రెండో రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు.

TV9 WITT: భారత్ ప్రపంచానికి ఆశాకిరణం.. ఎన్నో సవాళ్లను అధిగమిస్తుందిః టీవీ సీఈవో బరున్ దాస్
Tv9 Md And Ceo Barun Das
Balaraju Goud
|

Updated on: Feb 26, 2024 | 9:54 AM

Share

టీవీ9 ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న What India Thinks Today శిఖరాగ్ర సదస్సు రెండవ ఎడిషన్‌ రెండోరోజు ఢిల్లీలో ప్రారంభమైంది. దేశంలోనే నంబర్ వన్ న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ గ్లోబల్ సమ్మిట్‌లో రెండో రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. రాత్రి 8 గంటలకు జరిగే సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. అలాగే ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, బాలీవుడ్ స్టార్ ఆయుష్మాన్ ఖురానా, కంగనా రనౌత్‌లతో సహా దేశ, విదేశాల నుండి చాలా మంది ప్రముఖులు నేటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శిఖరాగ్ర సమావేశంలో రెండో రోజు TV9 MD & CEO బరున్ దాస్‌ స్వాగతోపన్యాసం చేశారు.

ప్రపంచ వేదికపై వేగవంతమైన పరిణామాల మధ్య భారతదేశం ప్రపంచం మధ్యలోకి వచ్చిందని TV9 నెట్‌వర్క్ MD CEO బరున్ దాస్ అన్నారు. దశాబ్దపు మార్పులను గమనిస్తూ, భౌగోళిక రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే, అన్ని సంఘటనలు భారతదేశానికి అనుకూలంగానే జరుగుతున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ ఎన్నో సవాళ్లను అధిగమించి అగ్రస్థానానికి ఎదుగుతుందని గట్టి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన ఆలోచనలతో ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ రెండో రోజు ప్రారంభమైంది.

టీవీ9 గ్లోబల్ సమ్మిట్‌కి ఇది రెండో సంవత్సరం. కానీ ఈ వేదిక నుంచి అనేక ఆలోచనల వలయం విస్తరిస్తానని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. “భారతదేశం: తదుపరి గొప్ప ఎత్తుకు సిద్ధంగా ఉంది” అనే విస్తృత థీమ్‌తో ఈ కాన్‌క్లేవ్ నిర్వహించడం జరుగుందని బరున్ దాస్ తెలిపారు. ఈ సమావేశానికి దేశ, విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. తమ ఆలోచనలు, అభిప్రాయాల ద్వారా దేశాభివృద్దికి దోహదపడుతాయని బరున్ దాస్ స్పష్టం చేశారు.

తన ప్రసంగాన్ని కొనసాగించిన బరున్ దాస్ ఆయన మాటల్లోనే… “భారతదేశం ఇప్పుడు ప్రపంచానికి ఆశాకిరణం. దక్షిణాదిలో ఈ నాయకత్వం కోసం ప్రపంచం ఎదురు చూస్తోంది. భారతదేశం ఇప్పుడు ప్రపంచానికి మధ్యలో ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారతదేశం కొత్త కేంద్రం అని ప్రపంచ ద్రవ్య నిధి సరిగ్గానే పేర్కొంది. ఇతర ఆర్థిక వ్యవస్థలు ప్రస్తుతం సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. చైనా విస్తరణ ఆశయాలు ప్రపంచానికి ఒక హెచ్చరిక సంకేతం. అందుకే ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలు చైనాకు దూరమవుతున్నాయి. అదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ మూడో అగ్రరాజ్యంగా ముందుకు సాగుతోంది. ఈ ప్రయాణంలో మనతో పాటు ఇతరులను కూడా తీసుకెళ్లాలి. అందుకే ప్రపంచానికి అవసరమైన ‘ఒక కుటుంబం, ఒకే ప్రపంచం, ఒకే భవిష్యత్తు’ అనే భావనను భారతదేశం కొనసాగిస్తుందన్నారు.”

“భారత్ పెద్ద ఎత్తుకు వెళ్లాలని కోరుకుంటోంది. అయితే అందుకు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. యూరప్, పశ్చిమాసియాలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. దాని వల్ల ప్రపంచంలో ఎలాంటి సంక్షోభం వచ్చినా రావచ్చు. అదే సమయంలో ప్రపంచీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. చాలా దేశాలు స్వయం సమృద్ధి సాధించాలని కలలు కంటున్నాయని” బరున్ దాస్ అన్నారు.

“ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నాయి. ఇది వాణిజ్యం వ్యాపారాల మధ్య సంఘర్షణకు దారి తీస్తుంది. దీంతో వినియోగదారులకు ప్రయోజనాలు గణనీయంగా తగ్గుతాయి. ప్రపంచ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ, సరఫరా గొలుసుపై ప్రభావం చూపుతుందని టీవీ సీఈవో ఎండీ బరున్ దాస్ అన్నారు. ఈ అనిశ్చితి ద్రవ్యోల్బణాన్ని పెంచి లక్షలాది మందిని పేదరికంలోకి నెట్టవచ్చు. భారత్‌తో సహా ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటికి పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని” బరున్ దాస్ అభిప్రాయపడ్డారు.

ఈరోజుర సాయంత్రం అభివృద్ధి చెందిన భారతదేశం గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీ కలలను స్వయంగా వివరిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ సాయంత్రం సంభాషించనున్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం అనే అంశంపై ఆయన ప్రసంగిస్తారు. ఈ సమావేశంలో పలువురు అనుభవజ్ఞులు, మేధావులు తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు. ఈ సదస్సు అనేక కొత్త ఆలోచనలు, కొత్త విషయాలను ఉత్పన్నం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని సీఈవో బరున్ దాస్ వివరించారు.

భారత్ ఆలోచనలు, ఆకాంక్షలను టీవీ9 శిఖరాగ్ర సదస్సు Live కోసం ఇక్కడ క్లిక్ చేయండి…