Srisaialm: మల్లన్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై దృష్టి.. అటవీ మార్గంలో పాదయాత్ర భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మార్చి 1 నుంచి 11 వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. రానున్న బ్రహ్మోత్సవాల నేపద్యంలో దేవస్థానం భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ముఖ్యంగా పాదయాత్ర భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా వెంకటాపురం, నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను, కైలాసద్వారం అటవీ ప్రాంతాలలో తగు ఏర్పాట్లు చేస్తున్నారు.
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు అలర్ట్ అయ్యారు. మల్లన్న దర్శనం కోసం లక్షల మంది భక్తులను కంట్రోల్ చేయడంలోనూ, ఏర్పాట్లు చేయడంలోనూ లోపాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా శ్రీశైలం అటవీ మార్గంలో పాదయాత్ర భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన పై దృష్టి పెట్టారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మార్చి 1 నుంచి 11 వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. రానున్న బ్రహ్మోత్సవాల నేపద్యంలో దేవస్థానం భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ముఖ్యంగా పాదయాత్ర భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా వెంకటాపురం, నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను, కైలాసద్వారం అటవీ ప్రాంతాలలో తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా వైద్యం, మంచినీరు, శౌచాలయాలు, చలవ పందిర్లు గత సంత్సరం కంటే 20 శాతం ఎక్కువగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆలయ ఈవో పెద్దిరాజు ఆదేశించారు.
అంతేకాదు అటవీ అధికారుల సహకారంతో జంగిల్ క్లియరెన్స్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. నాగులూటి వద్ద మంచనీటి కోనేరును శుభ్ర పరచాలని ఆదేశించారు. కాలిబాటగా అటవీ మార్గంలో వచ్చే భక్తులకు ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, అటవీ మార్గంలో మార్గ సూచిక బోర్డ్స్ ఏర్పాట్లు చేసి అలానే అవసరమైన ఔషధాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టాలని దేవస్థానం వైద్య విభాగాన్ని ఆదేశించారు. కార్యక్రమంలో అటవీశాఖ, దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..