Srivari Kalyanam: దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ఘనంగా శ్రీవారి కల్యాణం.. హాజరైన సీఎం ఏ నాథ్ సహా పలువురు అధికారులు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తోపాటు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ శ్రీవారి కళ్యాణం లో పాల్గొన్నారు. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ చేస్తున్న కార్యక్రమాలను సీఎం షిండే, డిప్యూటీ సిఎం పడ్నవీష్ లు అభినందించారు. స్వామివారి కల్యాణం లో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.
తిరుమల శ్రీవారి కళ్యాణం దేశ ఆర్ధిక రాజధాని ముంబై మహానగరంలో కన్నుల పండువగా జరిగింది. తూర్పు దోంభివలి ప్రాంతంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణం టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తోపాటు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ శ్రీవారి కళ్యాణం లో పాల్గొన్నారు. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ చేస్తున్న కార్యక్రమాలను సీఎం షిండే, డిప్యూటీ సిఎం పడ్నవీష్ లు అభినందించారు. స్వామివారి కల్యాణం లో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.
కల్యాణోత్సవం లో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, ఈవో ధర్మారెడ్డి తో పాటు ఎంపి శ్రీకాంత్ షిండే, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు. రాత్రి 10 గంటల వరకు శ్రీవారి కళ్యాణోత్సవం జరిగింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..