Pakistan: లాహోర్‌లో మహిళ వస్త్రధారణపై వివాదం.. బహిరంగంగా బట్టలు విప్పాలంటూ జులుం

సమాచారం ప్రకారం మహిళ తన భర్తతో కలిసి రెస్టారెంట్‌లో కూర్చుంది. అప్పుడు తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్తాన్ కార్యకర్తలు ఆ మహిళ ధరించిన దుస్తులను చూశారు. దీంతో ఎందుకు ఈ కుర్తాను వేసుకున్నావు.. దుస్తులపై ఖురాన్ శ్లోకాలున్నాయి. కనుక వెంటనే విప్పు అంటూ డిమాండ్ చేశారు. ఇది విన్న మహిళ భయపడింది. చేతులతో ముఖాన్ని కూడా కప్పుకుంది. ఇంతలో అక్కడ రద్దీ మరింత పెరిగింది. అయితే తాను వేసుకున్న కుర్తాపై ఉన్నవి ఖురాన్‌లోని శ్లోకాలని తనకు తెలియదని ఆ మహిళ చెప్పింది.

Pakistan: లాహోర్‌లో మహిళ వస్త్రధారణపై వివాదం.. బహిరంగంగా బట్టలు విప్పాలంటూ జులుం
Asp Shehrbano Saves Woman
Follow us
Surya Kala

|

Updated on: Feb 26, 2024 | 1:05 PM

దాయాది దేశం పాకిస్తాన్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. లాహోర్‌లోని ఇచ్రాలో తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్తాన్ కార్యకర్తలు తాను ధరించిన దుస్తులపై దూషించారని ఒక మహిళ ఆరోపించింది. దుస్తులపై ఖురాన్‌లోని శ్లోకాలు రాసి ఉన్నాయని చెప్పింది. అంతేకాదు తనను బహిరంగంగా తన కుర్తీని తీసివేయమని డిమాండ్ చేసినట్లు పేర్కొంది. ఆరుబయట ఒక్కసారిగా అందరూ కలిసి తనను కుర్తీ తీయమని ఒత్తిడి చేయడంతో బాధిత మహిళ భయపడిపోయింది. వెంటనే ఆ ఆమె భర్త పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో గుల్బర్గ్ ఏఎస్పీ సయ్యదా షెహర్బానో నఖ్వీ వచ్చి ఆ మహిళను రక్షించారు. అంతవరకూ ఆ మహిళ ఒంటరిగా కార్యకర్తలను ఒంటరిగా ఎదుర్కొంది.

సమాచారం ప్రకారం మహిళ తన భర్తతో కలిసి రెస్టారెంట్‌లో కూర్చుంది. అప్పుడు తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్తాన్ కార్యకర్తలు ఆ మహిళ ధరించిన దుస్తులను చూశారు. దీంతో ఎందుకు ఈ కుర్తాను వేసుకున్నావు.. దుస్తులపై ఖురాన్ శ్లోకాలున్నాయి. కనుక వెంటనే విప్పు అంటూ డిమాండ్ చేశారు. ఇది విన్న మహిళ భయపడింది. చేతులతో ముఖాన్ని కూడా కప్పుకుంది. ఇంతలో అక్కడ రద్దీ మరింత పెరిగింది. అయితే తాను వేసుకున్న కుర్తాపై ఉన్నవి ఖురాన్‌లోని శ్లోకాలని తనకు తెలియదని ఆ మహిళ చెప్పింది. ఇది కువైట్ బ్రాండ్‌కు చెందిన దుస్తులు. అరబిక్ లో రాసి ఉంది. ఖురాన్ శ్లోకాలతో దీనికి సంబంధం లేదని చెప్పింది. అయితే ఆ మహిళ చెప్పిన మాటలు ఎవరూ వినడానికి సిద్ధంగా లేరు.

ఇవి కూడా చదవండి

ఈ సమయంలో అక్కడ ఉన్నవారు కొందరు ఆ మహిళ తలను శరీరం నుంచి వేరు చేయమంటూ నినాదాలు చేయడం మొదలు పెట్టారు. మహిళ భర్త వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన గుల్బర్గ్ ఏఎస్పీ సయ్యదా షెహర్బానో నఖ్వీ తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న పరిస్థితిని ఆయన ఎదుర్కొన్న తీరు నిజంగా ప్రశంసనీయం. ముందుగా మహిళ భద్రత కోసం ముందుగా పోలీసుల బృందం రెస్టారెంట్ లోపల అడుగు పెట్టింది. మహిళకు ధరించేందుకు బురఖా ఇచ్చారు. మరోవైపు రెస్టారెంట్ వెలుపల ప్రజలు  ‘ తలను శరీరం నుంచి వేరు చేయమంటూ నినాదాలు’ చేస్తూనే ఉన్నారు. అప్పుడు ఏసీపీ స్వయంగా వారితో మాట్లాడారు. తాను గత ఏడాది కాలంగా ఇక్కడ విధులను నిర్వహిస్తున్నట్లు.. ఇలాంటి మూడు కేసులను పరిష్కరించినట్లు చెప్పారు. ప్రజలు పోలీసులపై నమ్మకం పెట్టుకోవాలి. అంటూ ఎస్పీ వాతావరణాన్ని కాస్త సద్దుమణిగెలా చేశారు. అనంతరం ఆ  మహిళను రెస్టారెంట్ నుంచి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

క్షమాపణలు చెప్పిన మహిళ

ఏఎస్పీ షరాబానో నఖ్వీ, ఇచ్రా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) బిలాల్ వెంటనే ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. ఆ మహిళ కావాలని ఇలా చేయలేదని తేలిందని ప్రజలు అపార్ధం చేసుకున్నారని చెప్పారు.  మహిళ దుస్తులపై ఖురాన్‌లోని శ్లోకాలు రాశారని వారు భావించారు. అయితే అవి ఖురాన్‌లోని వాక్యాలు కాదు. ఇది కేవలం అరబిక్ భాషలో వ్రాయబడ్డాయని పేర్కొన్నారు. అయితే ఆ మహిళ పోలీస్ స్టేషన్‌ నుంచి కెమెరా ముందు ప్రతి ఒక్కరికీ క్షమాపణలు కూడా చెప్పింది. నేనే సున్నీ ముస్లింని అని.. తన వేషధారణను ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారని తనకు తెలియదని  వెల్లడించింది. ఈ కుర్తా డిజైన్ నాకు బాగా నచ్చింది. కాబట్టి నేను దానిని ధరించాను. అయితే అందులో ఖురాన్‌కు సంబంధించిన రాసి లేదు. అయినప్పటికీ తాను ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే, అందుకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..