Rajasthan: స్కూల్‌లో సరస్వతి దేవిని అవమానించిన టీచర్.. సస్పెండ్ చేసిన ప్రభుత్వం
స్కూల్ లో స్టూడెంట్స్ చదువుల విషయంలో సరస్వతి దేవి సహాయం సహకారం ఏంటి.. అసలు ఎక్కడ సరస్వతి దేవి ఉంది.. అంటూ టీచర్ చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. హేమలతా బైర్వా తన వ్యాఖ్యల ద్వారా , చర్య ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, రెచ్చగొట్టడంపై ప్రాథమిక విచారణ ముగిసిన తర్వాత సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేసినట్లు బరన్ జిల్లా విద్యా శాఖ అధికారి పేర్కొన్నారు.
హిందువులు చదువుల తల్లి సరస్వతి దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ముఖ్యంగా స్టూడెంట్స్ అయితే సరస్వతిదేవిని పూజిస్తే తెలివి జ్ఞానం పెరుగుతాయని నమ్మకం. అయితే ఓ టీచర్ ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ పర్వదినం సందర్భంగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పుడు చర్యలు తీసుకున్నారు. సరస్వతీదేవిని అగౌరవ పరుస్తూ చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో గొడవలు జరిగినట్లు నిర్ధారించుకున్న అధికారులు చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు సరస్వతీ దేవిని అగౌరవపరిచినందుకు, మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ ఆదేశాల మేరకు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు హేమలతా బైర్వాను సస్పెండ్ చేసినట్లు వారు చెప్పారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు.
స్కూల్ లో స్టూడెంట్స్ చదువుల విషయంలో సరస్వతి దేవి సహాయం సహకారం ఏంటి.. అసలు ఎక్కడ సరస్వతి దేవి ఉంది.. అంటూ టీచర్ చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. హేమలతా బైర్వా తన వ్యాఖ్యల ద్వారా , చర్య ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, రెచ్చగొట్టడంపై ప్రాథమిక విచారణ ముగిసిన తర్వాత సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేసినట్లు బరన్ జిల్లా విద్యా శాఖ అధికారి పేర్కొన్నారు.
కిషన్‌గంజ్ ప్రాంతంలోని లకాడియాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వేదికపై సరస్వతీ దేవి చిత్రపటాన్ని ఉంచడంపై వివాదం ఏర్పడింది. ప్రాథమిక విచారణలో స్థానిక ప్రజల మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, రెచ్చగొట్టడం వంటి వాటికి ఉపాధ్యాయురాలే కారణమని తేలింది. దీంతో ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు బరన్ జిల్లా విద్యా (ప్రాథమిక) అధికారి పీయూష్ కుమార్ శర్మ పీటీఐకి తెలిపారు. ఈ సస్పెండ్ కాలంలో డైరెక్టరేట్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బికనీర్‌లో తన హాజరును నమోదు చేసుకోవాలని ఉపాధ్యాయురాలిని ఆదేశించినట్లు శర్మ తెలిపారు.
ఈ ఏడాది జనవరి 26న పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఉపాధ్యాయుడికి, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వేడుకల్లో వేదికపై సరస్వతీ దేవి చిత్రపటాన్ని ఉంచాలని స్థానిక గ్రామస్తులు పట్టుబట్టగా, మహాత్మా గాంధీ, భీమ్‌రావు అంబేద్కర్ చిత్రాలతో పాటు సరస్వతీ దేవి చిత్రపటాన్ని వేదికపై ఉంచేందుకు బైర్వ నిరాకరించారు. అంతేకాదు సరస్వతీ దేవి పాఠశాలకు, విద్యకు ఏమీ చేయలేదని హేమలత స్థానికులను మరింత రెచ్చగొట్టింది. అయితే లవ్ జిహాద్, ఇస్లామిక్ జిహాద్, నిషేధిత ఇస్లామిక్ సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో కోట జిల్లాలోని సంగోడ్ ప్రాంతంలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ ఖజూరీకి చెందిన మరో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులను అంతకుముందు సస్పెండ్ చేసి, వారిపై విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..