AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tony Abbott: ‘మోదీ శక్తివంతమైన నాయకుడు..’ భారత్‌పై ఆస్ట్రేలియా మాజీ ప్రధాని ప్రశంసలు

టీవీ9 నెట్‌వర్క్ నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్ టుడే సదస్సులో రెండో రోజు ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ పాల్గొన్నారు. రెండో రోజు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. తన ప్రసంగంలో భారత్‌పై ప్రశంసలు కురిపించారు. ఆసియాలోనే భారత్ సూపర్ పవర్ అని గుర్తు చేశారు. బ్రిటన్‌లో ఉన్నట్లే ఇండియా న్యాయవ్యవస్థ కూడా స్వతంత్రంగా ఉంటుందన్నారు.

Tony Abbott: 'మోదీ శక్తివంతమైన నాయకుడు..' భారత్‌పై ఆస్ట్రేలియా మాజీ ప్రధాని ప్రశంసలు
Tony Abbott - PM Modi
Ram Naramaneni
|

Updated on: Feb 26, 2024 | 12:23 PM

Share

మోదీ ప్రభుత్వ పనితీరును ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ కొనియాడారు. ప్రధాని మోదీ హయాంలో ప్రపంచంలోని రెండు ప్రజాస్వామ్య అగ్రరాజ్యాల్లో భారత్ ఒకటిగా ఎదిగిందని టోనీ అబాట్ అన్నారు. స్వేచ్ఛాయుత ప్రపంచ నాయకుడి గురించి మాట్లాడినప్పుడల్లా మోడీ పేరు ముందు వరసలో ఉంటుంది అబాట్ విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశం ఎప్పుడూ దూకుడు ప్రదర్శించలేదని, ప్రపంచ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకుందని అబాట్ అన్నారు. క్వాడ్‌ను బలోపేతం చేయడంలో భారత ప్రధాని మోదీ ముఖ్యమైన పాత్ర గురించి కూడా అబాట్ మాట్లాడారు.  NATO తర్వాత క్వాడ్ రెండవ బలమైన సంస్థ అని అన్నారు.

80 నుంచి 97 శాతం జనాభాకు స్వచ్ఛమైన నీరు, విద్యుత్, పారిశుధ్యాన్ని భారతదేశం అందించిందని టోనీ అబాట్ ప్రశంసించారు. ఇవి సాధారణ విషయాలే అయినప్పటికీ భౌగోళిక రాజకీయాలలో ముఖ్యమైనవి అని అబాట్ అన్నారు. ఇక్కడి డిజిటల్ విప్లవం, మెట్రో అభివృద్ధి, అంతరిక్షంలో భారతదేశం సాధించిన విజయాలను టోనీ అబాట్ ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా మోదీ నాయకత్వాన్ని మెచ్చుకుంటున్నారని, ఆయన సాధారణ నాయకుడు కాదని అబాట్ వ్యాఖ్యానించారు.  భారత ప్రధాని అమెరికా అధ్యక్షుడిలా శక్తివంతమైన వ్యక్తి అవుతారని పేర్కొన్నారు.

భారతదేశం ఉజ్వలమైన అవకాశాల దేశమని, అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్నప్పటికీ కొత్త రికార్డులు సృష్టిస్తోందని టోనీ అబాట్ అన్నారు. చైనా తన పొరుగు దేశాలను వేధిస్తున్నదని, యుద్ధం చేయకుండా గెలవాలని చైనా కోరుకుంటోందని, ఇది ప్రపంచానికి మంచి సంకేతం కాదని అబాట్ అన్నారు. తైవాన్‌ను చైనా ఆక్రమించాలనుకునే విధానాన్ని ఆయన ఖండించారు.

భారత్ ఆలోచనలు, ఆకాంక్షలను టీవీ9 శిఖరాగ్ర సదస్సు Live కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…