Smriti Irani: భారత మహిళా శక్తి వైభవాన్ని ప్రపంచం చూస్తోంది: స్మృతి ఇరానీ
వాట్ ఇండియా టుడే థింక్స్ గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రాం ఫిబ్రవరి 27 వరకు కొనసాగుతుంది. 'వాట్ ఇండియా థింక్స్ టుడే' గ్లోబల్ సమ్మిట్‌లో రెండవ రోజు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రధాని నరేంద్ర మోడీ మహిళల అభ్యన్నతి కోసం తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసలు గుప్పించారు. కాగా ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు.

దేశంలో నంబర్-1 న్యూస్ నెట్‌వర్క్ TV9 నిర్వహిస్తున్న ‘వాట్ ఇండియా టుడే థింక్స్’ గ్లోబల్ సమ్మిట్‌లో ఈరోజు రెండవ రోజు. సదస్సు రెండో రోజున కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ‘మహిళా శక్తి — అభివృద్ధి చెందిన భారతదేశం’ అనే అంశంపై ప్రసంగించారు. మహిళల కోసం ప్రధాని మోదీ ఎన్నో గొప్ప సంస్కరణలు తెచ్చారని అన్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆసుపత్రుల్లోనే మహిళలకు ప్రసవాలు జరిగేలా చూశారని చెప్పారు. ప్రధాని మోదీ మహిళల సామర్థ్యాన్ని గుర్తించారని, వారికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చారని స్మృతి ఇరానీ అన్నారు. ఆర్థిక వ్యవస్థలో మహిళలను సమాన భాగస్వాములను చేశారని చెప్పుకొచ్చారు.
మహిళల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, వారికి బలం చేకూర్చే ఎన్నో కార్యక్రమాలను ప్రధాని మోదీ తీసుకొచ్చారని ఇరానీ చెప్పారు. ఈ సందర్భంగా ఇరానీ ‘లఖపతి దీదీ’ నుంచి ‘డ్రోన్ దీదీ’ వరకు పథకాలను ప్రస్తావించారు. ప్రధాన మంత్రి మాతృ వందన పథకం గురించి స్మృతి ఇరానీ ప్రస్తావిస్తూ, ఈ పథకం మహిళలకు కొత్త శక్తిని ఇచ్చిందని అన్నారు. ఈ పథకం ద్వారా సుమారు మూడున్నర లక్షల మంది మహిళలు లబ్ధి పొందారని తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానిగా నరేంద్ర మోదీ సేవలను చూసే అదృష్టం తనకు దక్కిందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. నేడు భారతదేశ మహిళలు ప్రపంచంలో తమ జెండాను ఎగురవేస్తున్నారని చెప్పారు. భారతదేశ మహిళా శక్తి వైభవాన్ని ప్రపంచం చూస్తోందని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ ప్రశ్న కేవలం స్త్రీలకు మాత్రమే ఎందుకు?
మీరు ఇల్లు, ఆఫీసు పనులు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అన్న ప్రశ్నకు.. మహిళలను మాత్రమే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారని తిరిగి ప్రశ్నించారు స్మృతి ఇరానీ. వేదికపై ఇంతకముందు ప్రసంగించిన మగ వక్తలను ఇదే ప్రశ్న ఎందుకు వేయలేదన్నారు.
భారత్ ఆలోచనలు, ఆకాంక్షలను టీవీ9 శిఖరాగ్ర సదస్సు Live కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




