TV9 WITT Summit 2024: ‘AI వల్ల ఉద్యోగాలు పోతాయా..?’ మైక్రోసాఫ్ట్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏం చెప్పారంటే
దేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ TV9 'వాట్ ఇండియా థింక్స్ టుడే' గ్లోబల్ సమ్మిట్ 2024 రెండవ రోజు కార్యక్రమంలో పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు జరిగిన 'ది ప్రామిస్ అండ్ పిట్‌ఫాల్స్' సెషన్‌లో శాంసంగ్ రీసెర్చ్ AI విజన్ డైరెక్టర్ అశోక్ శుక్లాతోపాటు AI నిపుణులు ప్రొఫెసర్ అనురాగ్ మారియల్, రిలయన్స్ జియో చీఫ్ డేటా సైంటిస్ట్ శైలేష్ కుమార్..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: దేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ TV9 ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ గ్లోబల్ సమ్మిట్ 2024 రెండవ రోజు కార్యక్రమంలో పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు జరిగిన ‘ది ప్రామిస్ అండ్ పిట్‌ఫాల్స్’ సెషన్‌లో శాంసంగ్ రీసెర్చ్ AI విజన్ డైరెక్టర్ అశోక్ శుక్లాతోపాటు AI నిపుణులు ప్రొఫెసర్ అనురాగ్ మారియల్, రిలయన్స్ జియో చీఫ్ డేటా సైంటిస్ట్ శైలేష్ కుమార్, రిలయన్స్ జియో చీఫ్ డేటా సైంటిస్ట్ శైలేష్ కుమార్.. TV9 వార్షిక కాన్ఫరెన్స్ వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ED సమిక్ రాయ్, మెర్జ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, చిత్రనిర్మాత జోనాథన్ బ్రోన్‌ఫ్‌మాన్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఉద్యోగాలకు AI ఎంత పెద్ద సవాలు అనే విషయంపై ఈ అనుభవజ్ఞులందరూ చర్చించారు.
WITT ఈవెంట్ లైవ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AI వల్ల ఉద్యోగాలు పోతాయా? ఎక్స్‌పర్ట్స్ ఆన్సర్ ఇదే
మైక్రోసాఫ్ట్ ఇండియా ఇడి సమిక్ రాయ్ ఈ సందర్భంగా పలు కీలక విషయాలు పంచుకున్నారు. AI అనేది భవిష్యత్ ఉద్యోగాల స్థితిస్థాపకతకు ఎంతో ఉపయోగపడుతుంది. దీని వల్ల ఉద్యోగాలకు ఎలాంటి ముప్పు లేదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఏఐ వల్ల భవిష్యత్తులో ఉద్యోగాలు పోవని ఆయన అన్నారు.
మైక్రోసాఫ్ట్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కార్పొరేట్, మీడియం అండ్ స్మాల్ బిజినెస్) ఈడీ సమిక్ రాయ్ మాట్లాడుతూ.. AI అనేది ప్రజలు తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసమేనని అన్నారు. ప్రపంచంలో చాలా అప్లికేషన్లు ఉన్నాయి. కానీ ఉద్యోగాలను సృష్టించడం, అందించడం విషయానికి వస్తే.. విద్యుత్, ఆవిరి ఇంజిన్లు, కంప్యూటర్ల ప్రారంభానికంటే ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. వాళ్లంతా ప్రపంచాన్నే మార్చేశారు. ఈ విషయాలన్నీ కూడా ప్రపంచానికి కొత్తవి. కానీ అవి ప్రజలకు ఉపాధిని కూడా అందించాయి. భారత్‌లోకి కంప్యూటర్ల రాకతో, ఐటీ కంపెనీలు దేశంలోకి వచ్చాయి. ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్రారంభమైంది. అంటే నేరుగా ఉద్యోగాలు పెరిగాయి. అలాగే AIతో మన నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. AI వల్ల ఉద్యోగాలు కోల్పోవడం జరగదు. AIని అందరూ స్వీకరించాలి.. అని వివరించారు.
మరిన్ని వాట్ ఇండియా థింక్స్ టుడే కథనాల కోసం క్లిక్ చేయండి.








