Viral Video: జూబ్లీహిల్స్‌లో యువతి వీరంగం! ట్రాఫిక్ హోంగార్డ్‌పై దాడి చేసి.. షర్టు చింపివేసి..
జూబ్లీహిల్స్‌లో ఓ యువతి హల్‌చల్ చేసింది. హైదరాబాదులోని బంజారాహిల్స్ ప్రాంతంలో ట్రాఫిక్ హోంగార్డ్‌పై దాడి చేసి ఫోన్ పగలగొట్టింది. అనంతరం బూతులు తిడుతూ నానా యాగి చేసింది. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ హోంగార్డుపై దాడి చేయంతో ఆమెపై కేసు నమోదైంది. మహిళ చేసిన రచ్చకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది..
హైదరాబాద్, ఫిబ్రవరి 26: జూబ్లీహిల్స్‌లో ఓ యువతి హల్‌చల్ చేసింది. హైదరాబాదులోని బంజారాహిల్స్ ప్రాంతంలో ట్రాఫిక్ హోంగార్డ్‌పై దాడి చేసి ఫోన్ పగలగొట్టింది. అనంతరం బూతులు తిడుతూ నానా యాగి చేసింది. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ హోంగార్డుపై దాడి చేయంతో ఆమెపై కేసు నమోదైంది. మహిళ చేసిన రచ్చకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే..
హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో రాంగ్ రూట్‌లో వచ్చిన యువతి కారును హోంగార్డ్ విగ్నేష్ అడ్డు్‌కున్నాడు. దీంతో యువతి బూతులు తిడుతూ అతని బట్టలు చింపి దాడికి పాల్పడింది. వీడియోలోని టైమ్‌స్టాంప్ ప్రకారం.. శనివారం సాయంత్రం సుమారు 8:24 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. రాంగ్ రూట్లో రావడంతో సహకరించడానికి బదులు, ఆ మహిళ ఆగ్రహానికి గురై తనను అడ్డుకున్నందుకు హోంగార్డును దూషించింది. చుట్టుపక్కల వారు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఆమె ఏమాత్రం తగ్గలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనను వీడియోలో చిత్రీకరిస్తున్న ట్రాఫిక్ హోంగార్డుపై ఆమె భౌతికంగా దాడి చేసింది. అనంతరం ఆ మహిళ.. హోంగార్డు బట్టలు చింపేసి అతని ఫోన్ లాక్కుంది.
వచ్చిందే రాంగ్ రూట్.. అడిగితే హోమ్ గార్డ్ బట్టలు చింపిన లేడీ
బంజారాహిల్స్ – ట్రాఫిక్ హోమ్ గార్డ్ పై మహిళ వీరంగం. జాగ్వర్ కార్లో రాంగ్ రూట్లో రావడమే కాకుండా అడ్డుకున్న హోంగార్డుపై బూతులు తిడుతూ అతని బట్టలు చింపి దాడి చేసిన మహిళ. కేసు నమోదు చేసిన పోలీసులు. pic.twitter.com/xYvWnndmo1
— Telugu Scribe (@TeluguScribe) February 25, 2024
డ్యూటీలో ఉన్న తనపై దాడి చేసినందుకు గానూ యువతిపై హోంగార్డ్ విగ్నేష్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాడిని వివరించి, సంఘటన స్థలంలో రికార్డు చేసిన వీడియో ద్వారా సాక్ష్యాలను అందించాడు. ఈ ఘటనపై పోలీసులు యువతిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.