WITT Global Summit: మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది: TV9 నెట్‌వర్క్ MD & CEO బరున్ దాస్

WITT Global Summit: మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది: TV9 నెట్‌వర్క్ MD & CEO బరున్ దాస్

Janardhan Veluru

|

Updated on: Feb 26, 2024 | 12:03 PM

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా త్వరలోనే భారత్ అవతరించబోతోందని టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈవో బరున్ దాస్ అన్నారు. దేశంలోనే నంబర్ వన్ న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 'వాట్ ఇండియా థింక్స్ టుడే' గ్లోబల్ సమ్మిట్‌ను ఢిల్లీలో నిర్వహిస్తోంది. రెండో రోజు సోమవారం బరున్ దాస్ తన స్వాగత ప్రసంగంతో సదస్సును ప్రారంభించారు.

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా త్వరలోనే భారత్ అవతరించబోతోందని టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈవో బరున్ దాస్ అన్నారు.దేశంలోనే నంబర్ వన్ న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ గ్లోబల్ సమ్మిట్‌ను ఢిల్లీలో నిర్వహిస్తోంది. రెండో రోజు సోమవారం బరున్ దాస్ తన స్వాగత ప్రసంగంతో సదస్సును ప్రారంభించారు. యావత్ ప్రపంచానికి ఇప్పుడు భారత్ ఆసక్తి కేంద్రంగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రకాశవంతంగా ఉండబోతోందని ఐఎంఎఫ్ కూడా అంచనావేస్తోందన్నారు. అదే సమయంలో పలు ప్రపంచ దేశాల్లో ఆర్థిక మాంధ్యం పరిస్థితులు నెలకొంటున్నాయని అన్నారు. చైనాతో పోల్చితే భారత్ వైపే ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయని అన్నారు. చైనా ప్రాదేశిక ఆశయాలు ఇతరులకు ముప్పుగా మారుతోందన్నారు.ప్రజాస్వామ్య దేశాలు చైనా పట్ల విముఖత చూపడానికి ఇది ప్రధాన కారణం అవుతోందన్నారు.

ఈ సందర్భంగా సమ్మిట్‌లో పాల్గొంటున్న ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్, మాల్దీవుల మాజీ రక్షణ మంత్రి మేడమ్ మరియా అహ్మద్ దీదీ, ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిల్లాన్‌లకు బరున్ దాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు వేర్వేరు సెషన్లలో ఈ ముగ్గురు ప్రముఖులు హాజరుకానున్నారు. అదే సమయంలో ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సదస్సుకు హాజరు కానున్నారు.

భారత్ ఆలోచనలు, ఆకాంక్షలను టీవీ9 శిఖరాగ్ర సదస్సు Live కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Published on: Feb 26, 2024 12:01 PM